యువకుల కార్ స్టంట్ : ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు.. పోలీసుల అదుపులో ఎనిమిది మంది

Siva Kodati |  
Published : Nov 08, 2022, 04:06 PM IST
యువకుల కార్ స్టంట్ : ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు.. పోలీసుల అదుపులో ఎనిమిది మంది

సారాంశం

హర్యానాలో గురుగ్రామ్‌లో ఎనిమిది మంది యువకులు చేసిన కారు స్టంట్ వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు కారణమైన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు

ఇటీవలి కాలంలో కొందరు యూట్యూబ్ వీడియోల కోసం , ఇన్‌‌స్టా రీల్స్ కోసం ప్రమాదకరమైన స్టంట్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. లేదంటే ఎదుటివారిని బలి తీసుకుంటున్నారు. తాజాగా హర్యానాలో గురుగ్రామ్‌లో ఎనిమిది మంది యువకులు చేసిన కారు స్టంట్ వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురుగ్రామ్‌లో సోమవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎనిమిది యువకులు మూడు కార్లతో మద్యం దుకాణం వద్ద ప్రమాదకర స్టంట్స్ చేశారు. 

ALso REad:Viral Video: ఒకే స్కూట‌ర్ పై ఆరుగురు.. రోడ్డుపై విన్యాసాలు.. వైర‌ల్ వీడియో !

ఈ క్రమంలో సౌరభ్ అనే వ్యక్తి తన కారుతో స్టంట్ చేస్తూ మద్యం దుకాణం వద్ద వున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సౌరభ్ శర్మ, రాహుల్, రవిసింగ్, వికాస్, మోహిత్, ముకుల్ సోనీ, లవ్‌, అశోక్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా మద్యం సేవించి ఈ స్టంట్స్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్