కోవిడ్ బీభత్సం.. పన్ను చెల్లింపుదారులకు ఐటీశాఖ శుభవార్త

Siva Kodati |  
Published : May 20, 2021, 07:43 PM IST
కోవిడ్ బీభత్సం.. పన్ను చెల్లింపుదారులకు ఐటీశాఖ శుభవార్త

సారాంశం

కోవిడ్ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పింది

కోవిడ్ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు చెప్పింది.

కంపెనీలకు సైతం రిటర్నుల దాఖలుకు నవంబర్‌ 30 వరకు అవకాశం ఇచ్చింది. దేశంలో కొవిడ్‌ సెకండ్ వేవ్ నేపథ్యంలో చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) వెల్లడించింది.

Also Read:ఇండియాలో తగ్గిన కోవిడ్ మరణాలు: కానీ పెరిగిన కేసులు

కాగా, వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్నుల దాఖలుకు జులై 31, కంపెనీలకు అక్టోబర్‌ 31గా సీబీడీటీ గడువు ఉండేది. కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం -16 గడువును సైతం సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది.  

మరోవైపు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల దాఖ‌లు ప్రక్రియను సుల‌భ‌త‌రం చేసేందుకు కొత్త ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ www.incometaxgov.inను తీసుకొచ్చింది. జూన్‌ 7 నుంచి ఈ కొత్త పోర్టల్‌ అందుబాటులోకి రానుంది. అయితే, జూన్‌ 1 నుంచి 6వ తేదీ వరకు పాత పోర్టల్‌ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu