SFJ తో లింక్ చేయ‌బ‌డిన యాప్‌లు, వెబ్‌సైట్‌, సోష‌ల్ మీడియా ఖాతాలు బ్లాక్

Published : Feb 22, 2022, 01:26 PM IST
SFJ తో లింక్ చేయ‌బ‌డిన యాప్‌లు, వెబ్‌సైట్‌, సోష‌ల్ మీడియా ఖాతాలు బ్లాక్

సారాంశం

New Delhi: చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల కింద నిషేధించబ‌డిన సిఖ్స్ ఫ‌ర్ జ‌స్టిస్ (Sikhs For Justice-SFJ) సంస్థ‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన ఉన్న పంజాబ్ పాలిటిక్స్ టీవీ, యాప్‌లు, వెబ్‌సైట్‌, సోష‌ల్ మీడియా ఖాతాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కేంద్ర స‌మాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసింది.   

New Delhi: చ‌ట్ట‌విరుద్ధ కార్య‌క‌లాపాల కింద నిషేధించబ‌డిన "సిఖ్స్ ఫ‌ర్ జ‌స్టిస్" (Sikhs For Justice-SFJ) సంస్థ‌తో స‌న్నిహిత సంబంధాలు క‌లిగిన ఉన్న పంజాబ్ పాలిటిక్స్ టీవీ, యాప్‌లు, వెబ్‌సైట్‌, సోష‌ల్ మీడియా ఖాతాల‌ను కేంద్ర ప్ర‌భుత్వం బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను కేంద్ర స‌మాచార, ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసింది.  ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల సమయంలో పబ్లిక్ ఆర్డర్‌కు భంగం కలిగించడానికి ఆన్‌లైన్ మీడియాను ఉపయోగించేందుకు ఛానెల్ ప్రయత్నిస్తోందని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, దీనికి ఖలిస్థానీ వేర్పాటు వాదుల నుంచి మద్దుతు ఉందని ఆరోపణలు ఉన్నాయి. 

విదేశీ ఆధారిత ఈ ఛానెల్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఖాతాల్లో పోస్టు చేసిన కంటెంట్ "మత సామరస్యాన్ని మరియు వేర్పాటువాదాన్ని ప్రేరేపించే సంభావ్యతను" కలిగి ఉందని కేంద్ర‌ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కంటెంట్ "భారత సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ‌ భద్రత, పబ్లిక్ ఆర్డర్‌కు హానికరంగా ఉన్నట్లు గుర్తించ‌బ‌డింది" అని పేర్కొంది. ఆయా సంస్థ తీసుకువ‌చ్చిన కొత్త యాప్‌లు, సోష‌ల్ మీడియా ఖాతాల‌ను ఉప‌యోగించి.. ఎన్నిక‌లను ప్ర‌భావితం చేసే విధంగా ముందుకు సాగింద‌ని గ‌మ‌నించామ‌ని తెలిపింది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం-1967 ప్రకారం సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ (Sikhs For Justice-SFJ) సంస్థ చట్టవిరుద్ధ సంస్థ‌గా ప్ర‌క‌టించ‌బ‌డ‌టంతో దానిపై నిషేధం కొన‌సాగుతోంది. SFJ వ్యవస్థాపకుడు, నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌పై  UAPA కింద  అభియోగాలు మోప‌బ‌డ్డాయి.

"భారత ప్రభుత్వం అప్రమత్తంగా.. భారతదేశంలోని మొత్తం సమాచార వాతావరణాన్ని సురక్షితంగా ఉంచడానికి కట్టుబడి ఉంది. భారతదేశ సార్వభౌమాధికారం మరియు సమగ్రతను అణగదొక్కే అవకాశం ఉన్న ఏవైనా చర్యలను అడ్డుకుంటుంది" అని సమాచార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్ర‌క‌ట‌న పేర్కొంది.  ఇదిలావుండ‌గా, ఇటీవ‌ల పంజాబ్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఖ‌లిస్థాన్‌, సిక్కువేర్పాటు వాదుల అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌లు రాజ‌కీయ పార్టీల నేత‌లు ఆయా అంశాల‌ను లేవ‌నెత్తుతూ విమ‌ర్శ‌లు, ఆరోప‌ణలు గుప్పించుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ నాయకుడు కుమార్ విశ్వాస్  తీవ్ర ఆరోప‌న‌లు గుప్పించారు. 

ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లోని వేర్పాటు వాదులకు మద్దతులు ఇస్తున్నారని కుమార్ విశ్వాస్ ఆరోపించారు. స్వతంత్ర  దేశానికి (ఖలీస్తాన్) ప్రధాని అవుతానని కేజ్రీవాల్ గతంలో తనతో అన్నాడని చెప్పుకొచ్చారు. ‘ఒకరోజు అతను (అరవింద్ కేజ్రీవాల్) నాకు పంజాబ్ సీఎం అవుతానని లేదా స్వతంత్ర దేశానికి (ఖలిస్తాన్) మొదటి ప్రధాని అవుతానని చెప్పారు’ అని కుమార్ విశ్వాస్ తెలిపారు. అధికారం కోసం కేజ్రీవాల్ ఎంతవరకైనా వెళ్తారని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే