Dera Baba: అత్యాచారం, హత్య కేసుల్లో దోషిగా నిర్దారణ అయి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్ ( డేరా బాబా)కు Z-Plus సెక్యూరిటీ కల్పించింది హర్యానా బీజేపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. డేరా బాబా.. ఇటీవలే పెరోల్ పై జైలు నుంచి విడుదలయ్యాడు.
Dera Baba: హర్యానా లో సాధ్వీలపై అత్యాచారం, ఓ ప్రముఖ జర్నలిస్టును హత్య కేసులో దోషిగా నిర్దారణ అయి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా బాబా రామ్ రహీమ్ ( డేరా బాబా)కు Z-Plus సెక్యూరిటీ కల్పించింది హర్యానా బీజేపీ సర్కారు . డేరా బాబా ప్రస్తుతం యావజ్జీవ కారాగశిక్ష అనుభవిస్తున్నాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెరోల్ పై విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత డేరాబాబాను ఖలిస్థానీ తీవ్రవాదులు టార్గెట్ చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డేరా బాబాకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులిచ్చింది.
డేరా బాబా .. కొందరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, ప్రముఖ జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి హత్య ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి సునారియా జైలుకు పంపింది. అయితే, ఈ కేసులో ఆగస్టు 27న రోహ్‌తక్‌లోని సునారియా జైలులో సీబీఐ కోర్టు విచారణ చేపట్టగా, రామ్ రహీమ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అదే సమయంలో జర్నలిస్టు హత్య కేసులో రామ్ రహీమ్ కూడా దోషిగా తేలింది. దీంతో 2017 నుంచి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.
సరిగ్గా పంజాబ్ ఎన్నికల సమయంలోనే 21 రోజుల పెరోల్ మంజూరు కావడంతో ఫిబ్రవరి 7న జైలు నుంచి విడుదలయ్యాడు. డేరా బాబా బయటికి రావడంతో విమర్శలు వచ్చాయి. ఇప్పడు ఏకంగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడంపై ప్రభుత్వం తీరుపై మండి పడుతున్నారు. పెరోల్ పై బయటున్న యావజ్జీవ ఖైదీ ప్రాణాలకు ప్రమాదముంటే.. అతనని జైలుకు తరలించాల్సింది పోయి ప్రజాధనం వృధా అయ్యేలా జెడ్ ప్లస్ భద్రతను కల్పించడమేంటనే విమర్శలు వెలువెత్తున్నాయి.
Z కేటగిరీ Security ఎవరెవరికి కల్పిస్తారు?
ముప్పు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) వంటి భద్రతా ఏజెన్సీల సమాచారం ఆధారంగా ఎవరెవరికీ ఏ స్థాయి భద్రత కల్పించాలనేది హోం శాఖ నిర్ణయిస్తుంది. ప్రధానమంత్రి, హోం మంత్రితో పాటు జాతీయ భద్రతా సలహాదారు వంటి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారికి నిబంధనల ప్రకారం వ్యక్తిగత భద్రతా ఏర్పాట్లు చేస్తారు. దేశంలో X, Y, Y-Plus, Z , Z-Plus. SPG (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కింద భద్రతా విభాగాలను వర్గీకరించారు. SPG అనేది ప్రధానమంత్రి, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉద్దేశించబడింది.
ఏయే కేటగిరికి ఎంత అంటే..?
>> X category రక్షణ ఉన్నవారికి ఒక గన్‌మ్యాన్‌ని మాత్రమే కేటాయిస్తారు.
>> Y category లో ఒక గన్‌మ్యాన్, స్టాటిక్ సెక్యూరిటీ కోసం ఒకరు (ప్లస్ ఫోర్ రొటేషన్‌లో) ఉంటారు.
>> Y-Plus category లో ఇద్దరు గన్‌మెన్‌లు (ప్లస్ నలుగురు రొటేషన్‌లో), నివాస భద్రత కోసం ఒకరు (ప్లస్ నలుగురు రొటేషన్) ఉంటారు.
>> Z category లో ఆరుగురు గన్‌మెన్‌లు, నివాస భద్రత కోసం మరో ఇద్దరు
>> Z-Plus category లో వ్యక్తిగత భద్రత కోసం 10 మంది భద్రతా సిబ్బంది, నివాస భద్రత కోసం ఇద్దరిని (ప్లస్ ఎనిమిది మంది)ని నియమిస్తారు. Z-Plus స్థాయి భద్రతను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలు చూసుకుంటారు.
ఇతర కేటగిరీ భద్రత కోసం ఢిల్లీ పోలీసులు లేదా ఐటీబీపీ, సీఆర్‌ఫీఎఫ్ సిబ్బందిని వినియోగిస్తారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు కూడా SPG భద్రత కల్పించింది. కానీ, ఇది తరువాత Z-ప్లస్ కేటగిరీకి మార్చబడింది.