తప్పుడు కేసులు: కోజికోడ్ ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై పోలీసుల దాడులు

Published : Mar 05, 2023, 12:15 PM ISTUpdated : Mar 05, 2023, 12:23 PM IST
తప్పుడు కేసులు:  కోజికోడ్  ఏషియానెట్  న్యూస్ కార్యాలయంపై  పోలీసుల దాడులు

సారాంశం

తప్పుడు కేసులతో  కేరళ రాష్ట్రంలోని  ఏషియా నెట్  కార్యాలయాలపై  పోలీసులు దాడులు  చేస్తున్నారు.  ఇవాళ కోజికోడ్  కార్యాలయంపై  పోలీసులు  దాడులు  చేశారు. 

తిరువనంతపురం:  తప్పుడు కేసులతో కేరళ రాష్ట్రంలోని  కోజికోడ్ లోని ఏషియానెట్  కార్యాలయంపై  ఆదివారం నాడు పోలీసులు దాడులు  చేస్తున్నారు.

 

శుక్రవారం నాడు  కొచ్చి కార్యాలయంపై  ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడి  చేసిన విషయం తెలిసిందే.కొచ్చిలోని  ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై  ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు  దాడిని   జర్నలిస్టు సంఘాలు  తీవ్రంగా ఖండించాయి . ఈ ఘటనపై  కేరళ జర్నలిస్ట్స్  యూనియన్ ఆగ్రహం వ్యక్తం  చేసిన విషయం తెలిసిందే.  కొచ్చిలోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంలోకి చొరబడి  ఉద్యోగులను  ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు బెదిరించడాన్ని  తిరువనంతపురం  ప్రెస్ క్లబ్ తీవ్రంగా తప్పుబట్టింది.  ఈ ఘటనకు పాల్పడిన నిందితులను  కఠినంగా శిక్షించాలని  కూడా  ప్రెస్ క్లబ్  డిమాండ్  చేసింది.  

శుక్రవారంనాడు  రాత్రి  కొచ్చి  ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై  ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు దాడికి దిగారు. ఇవాళ మాత్రం  కోజికోడ్ లోని ఏషియానెట్ న్యూస్ కార్యాలయంపై  పోలీసులు దాడులు చేస్తున్నారు. తప్పుడు కేసులతో   ఏషియా నెట్ న్యూస్ కార్యాలయంపై  పోలీసులు సోదాలు  చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!