కారులో మహిళ మృతదేహం...కిడ్నాప్ చేసి హత్య చేశారా?

Published : Oct 02, 2018, 03:40 PM IST
కారులో మహిళ మృతదేహం...కిడ్నాప్ చేసి హత్య చేశారా?

సారాంశం

ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. నగరంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో రోడ్డు పక్కన పార్క్ చేసిన కారులో ఇలా మహిళ చనిపోయి పడివుంది. డ్రైవర్ సీటు పక్కన మృతదేహాన్ని ఇవాళ ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో దర్యాప్తు ప్రారంభించారు.  మహిళలు మొదట కిడ్నాప్ చేసిన దుండగులు చంపేసి ఇలా కారులో తీసుకువచ్చి వదిలేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇలా మృతదేహాన్ని తరలించే క్రమంలో గాని, హత్యా సమయంలో కాని కారు  ప్రమాదానికి గురయి వుంటదని అభిప్రాయపడ్డారు. రోడ్డుపై కూడా కారు జారిన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.  అందువల్లే కారు ముందు భాగంలో ఇంతలా డ్యామేజ్ అయి వుంటుందని విశ్లేషిస్తున్నారు. 

అలాగే కారు పార్క్ చేసిన ప్రాంతానికి దగ్గర్లోని ఓ షోరూం, రెండు ఇళ్లలో వున్న సిసి కెమెరా రికార్డులను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే కారులోంచి ఓ మొబైల్ ను స్వాదీనం చేసుకున్నామని...దాని  ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

 మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మహిళ మృతికి సంబంధించిన మరిన్న వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే