మాజీ ప్రధానికి మరింత గౌరవం... మన్మోహన్ సింగ్ స్మారకం ఏర్పాటుకు మోదీ సర్కార్ రెడీ

By Arun Kumar P  |  First Published Dec 28, 2024, 5:17 PM IST

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకానికి కేంద్రం స్థలం కేటాయించనుంది. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి తెలియజేశారు.


న్యూఢిల్లీ :  భారత మాజీ ప్రధాని, దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు డా. మన్మోహన్ సింగ్  92 ఏళ్ల వయసులో మ‌ృతిచెందారు. గత గురువారం (డిసెంబర్ 26) న ఆయన డిల్లీలోకి ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూసారు. ఇవాళ (డిసెంబర్ 28) ఆయన అంత్యక్రియలు ముగిసాయి. ఆయన ఇంటినుండి పాార్థివదేహాన్ని ఏఐసిసి కార్యాలయానికి తరలించి అక్కడ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. అనంతరం నిగమ్ భోద్ ఘాట్ వరకు అంతిమయాత్ర సాగింది. 

అయితే ఆర్థికవేత్తగా, ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించిన మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం స్మారకాన్ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకోసం స్థలాన్ని కేటాయించేందుకు సిద్దంగా వున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి విషయాన్ని తెలియజేసారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Latest Videos

undefined

కేంద్ర హోంశాఖ "మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకానికి సంబంధించిన విషయాలు" అనే  పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి అందిందని అందులో పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేబినెట్ సమావేశం తర్వాత మల్లిఖార్జున ఖర్గే, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి స్మారకానికి స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈలోగా అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చని సూచించినట్లు సమాచారం. ట్రస్ట్ ఏర్పాటు, స్మారకానికి స్థలం కేటాయింపుపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 

92 ఏళ్ల వయసులో మన్మోహన్ సింగ్ మృతి

కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లపాటు భారత ప్రధానిగా పనిచేశారు. అంతకుముందు పివి నరసింహారావు హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన ఆయన దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలకు తీసుకువచ్చారు. ఇలా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయన ఎంతో కృషి చేసారు. ఇలాంటి గొప్ప నాయకుడు 92 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురయి గత గురువారం మరణించారు.  

 
అయితే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారకానికి స్థలం కేటాయించకపోవడం ఆయనను అవమానించడమేనని కాంగ్రెస్ అంటోంది. దేశం ఈనాడు ఆర్థికంగా ఈస్థాయిలో వుండటాానికి గతంలో మన్మోహన్ సింగ్ చేపట్టిన సంస్కరణలే కాారణమని... అలాంటిది ఆయన సేవలను కూడా మోదీ సర్కార్ గుర్తించకుండా అవమానిస్తోందని ఆరోపిస్తున్నారు. దేశ తొలి సిక్కు ప్రధానిని కేంద్ర సర్కార్ ఉద్దేశపూర్వకంగా అవమానిస్తున్నారని కాంగ్రెస్ శుక్రవారం ఆరోపించింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం ఉదయం 11.45 గంటలకు ఢిల్లీలోని నిగమ్‌బోధ్ ఘాట్‌లో అధికారిక లాంఛనాలతో జరుగుతాయని హోంమంత్రిత్వ శాఖ ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేసింది.  
 
మరిన్ని చదవండి : 

మన్మోహన్ సింగ్ ది కోహ్లీ ఫ్యామిలీనా!!

మన్మోహన్ సింగ్, రతన్ టాటా మధ్య పోలికలు ఇవే ... ఇద్దరూ అలా ఎదిగినవాళ్లే

click me!