ఎయిర్ ఇండియా స్వర్ణయుగం రాబోతుంది: ఏ‌ఐ ఉద్యోగులకు స్వాగతం పలుకుతూ టాటా సన్స్ ఛైర్మన్ లేఖ..

By asianet news teluguFirst Published Jan 27, 2022, 10:55 PM IST
Highlights

అప్పుల భారంతో ఉన్న ఎయిర్ ఇండియా(air india)ను టాటా సన్స్ (tata sons)గురువారం టేకోవర్ చేసుకున్నా తర్వాత ఎయిర్ ఇండియా ఉద్యోగులకు  రాసిన మొదటి లేఖలో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ "ఎయిరిండియా స్వర్ణయుగం (golden age)రాబోతోందని తాను నమ్ముతున్నాను" అని అన్నారు.
 

ఎయిరిండియా ఉద్యోగులకు టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గురువారం ఓ లేఖ రాశారు. ఇందులో ఎయిరిండియాను ప్రపంచ శ్రేణి విమానయాన సంస్థగా తీర్చిదిద్దేందుకు టాటా గ్రూపు కట్టుబడి ఉందని అన్నారు. అయితే ప్రభుత్వరంగ విమానయాన సంస్థ యాజమాన్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నేడు టాటా సన్స్ కు అప్పగించింది. అనంతరం ఎన్ చంద్రశేఖరన్ ఎయిర్ ఇండియా ఉద్యోగులను స్వాగతం పలుకుతూ, టాటా గ్రూప్‌కు సంస్కరణల పట్ల ప్రధాని నరేంద్ర మోడీ నిబద్ధత, భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తిపై విశ్వాసం గురించి పూర్తిగా తెలుసునని అన్నారు.

దాదాపు 69 ఏళ్ల తర్వాత గురువారం నాడు ప్రభుత్వం ఎయిర్ ఇండియాను టాటా గ్రూపునకు అధికారికంగా అప్పగించింది.  ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 8న ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీకి చెందిన టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.18,000 కోట్లకు విక్రయించింది. ఎయిర్ ఇండియాను 1932లో టాటా గ్రూప్ ప్రారంభించింది. అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ విమానయాన సంస్థను జాతీయం చేశారు.

ఈ కారణంగానే చారిత్రక మార్పు
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ లేఖలో, “ఎయిరిండియాను తిరిగి టాటా గ్రూప్‌లోకి తీసుకురావడం మేము సంతోషిస్తున్నాము. అలాగే దానిని గ్లోబల్ ఎయిర్‌లైన్‌గా మార్చడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము. మా గ్రూప్‌కి ఎయిర్ ఇండియా ఉద్యోగులందరినీ నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. అలాగే నేను మీతో కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నాను. మనం కలిసి ఎలాంటి విజయాలు సాధిస్తామో దేశమంతా చూడాలీ ఆన్నారు.

ప్రజల నోట ఒక్కటే మాట - ఘర్ వాపస్ 
ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ, "అందరిలాగే, నాకు కూడా ఎయిరిండియా  బంగారు చరిత్ర  కథలు గుర్తున్నాయి. నేను ఎయిర్ ఇండియాలో మొదటి ఫ్లైట్  ప్రయాణం డిసెంబరు 1986లో జరిగింది. నేను ఈ ఎయిర్‌లైన్‌లో ప్రయాణించడం ఎప్పటికీ మరచిపోలేను. మాకు ఎయిరిండియాతో చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు మరింత ముందుకు చూసే సమయం వచ్చింది," అని చెప్పాడు.

విమానయాన సంస్థను నిలబెట్టడానికి 
విమానయాన సంస్థ భవిష్యత్తుపై చంద్రశేఖరన్ మాట్లాడుతూ, "ఈరోజు ఒక కొత్త ప్రారంభం. దేశం మొత్తం చూపు మనపై ఉంది. మనం కలిసి ఎలాంటి విజయాలు సాధిస్తామో వారు చూడాలనుకుంటున్నారు. ఈ ఎయిర్‌లైన్స్ ఇప్పుడు దేశానికి అండగా నిలబడాలి. ఎయిర్ ఇండియాతో కలిసి పనిచేయడానికి అలాగే ఈ జాతీయ విమానయాన సంస్థను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి మనము కష్టపడాలి."అని అన్నారు.

click me!