అమ్మాయిలూ... చీప్ గా ప్యాజ్ దాలో అనకండి... ఎందుకంటే ఇవి బంగారు పానీపూరిలు..!

By Arun Kumar P  |  First Published Apr 16, 2024, 8:41 AM IST

గోల్డెన్ పానీపూరి... వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. ఓ వ్యాపారి వినూత్నంగా గోల్డ్, సిల్వర్ తో పానీపూరీలను సరికొత్తగా తయారుచేస్తున్నాడు. ఈ గోల్డెన్ పానీపూరి ఎక్కడ దొరుకుతుందంటే....


అహ్మదాబాద్ : మహిళలు మరీ ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు పానీపూరి అంటే పడిచస్తారు. వారికి హిందీ బాష రాకున్నా ఒక్కపదం మాత్రం బాగా వస్తుంది... అదే 'భయ్యా... ప్యాజ్ దాలో''. ఇది పానీపూరి పుణ్యమే. పానీపూరి వ్యాపారంలో ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్లే వుంటారు... కాబట్టి వారికి తెలుగురాదు... మన తెలుగమ్మాయిలకు హిందీ రాదు. కానీ పానీపూరిపై ఇష్టంతో మన అమ్మాయిలు ఉల్లిపాయలను అడగడం మాత్రం సక్సెస్ ఫుల్ గా నేర్చుకున్నారు. కేవలం తెలుగమ్మాలకే కాదు దేశంలోని అమ్మాయిలందరూ పానీపూరీని ఇష్టపడేవాళ్లే. చిన్నా పెద్ద తేడాలేదు...  ప్రతిఒక్కరి ఇష్టమైన చిరుతిళ్ల లిస్ట్ లో పానీపూరి తప్పకుండా వుంటుంది. 

ఇక మహిళలు ఇష్టపడే మరో వస్తువు బంగారం. భారతీయ  మహిళలకు బంగారంతో విడదీయరాని సంబంధం వుంది. ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి తోటి మహిళల మధ్య తానే  అందంగా కనిపించాలని ప్రతీ మహిళలు కోరుకుంటారు.  ఏ పెళ్లిలోనో, శుభకార్యంలోనో మహిళలంతా ఒక్కచోటికి చేరారంటే తప్పకుండా బంగారంపై డిస్కషన్ వుంటుంది. ఇంతలా బంగారాన్ని ఇష్టపడతారు మహిళలు.    

Latest Videos

undefined

ఇలా మహిళలు ఇష్టమైన పానీపూరీ, బంగారంను ఒక్కచోటికి చేర్చితే ఎలావుంటుంది... ఈ ఆలోచనే అదిరిపోలా..! ఇలా అందరిలా కాకుండా కాస్త క్రియేటివ్ గా ఆలోచించి రెండుచేతులా డబ్బులు సంపాదిస్తున్నాడో పానీపూరి వ్యాపారి. బంగారం, వెండి  పూతతో కూడిన పానీపూరీలు దగదగా మెరిసిపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసి బంగారు పానీపూరీలా..! అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు చెందిన ఓ పానీపూరి వ్యాపారి సరికొత్త ఆలోచనతో తన బిజినెస్ ను వృద్దిచేసుకున్నాడు. అందరు వ్యాపారుల్లా సాధారణ పానీపూరీలే చేయకుండా బంగారం, వెండితో తన పానీపూరీలకు టచ్ ఇచ్చాడు. బంగారు, సిల్వర్ పూతను  పానీపూరీలకు అద్దుతుండటంతో అవికాస్త దగదగా మెరిసిపోతూ అందరినీ ఆకర్శిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు తమకిష్టమైన బంగారం, పానీపూరీ ఒకేచోట బంగారు పానీపూరీగా లభిస్తుడటంతో లొట్టలేసుకుంటూ తింటున్నారు. ఈ బంగారు, వెండి పానీపూరీలను తినేందుకు అహ్మదాబాద్ వాసులు ఇష్టపడుతున్నారు.  

కేవలం బంగారు, వెండి పానీపూరీలే కాదు డ్రైప్రూట్స్, హనీ పానీపూరీలు కూడా ఈ గుజరాతీ వ్యాపారి వద్ద లభిస్తున్నాయి. ఈ బంగారు పానీపూరీలు మరింత రిచ్ గా వుండేందుకు ఉల్లిపాయలు కాకుండా డ్రైప్రూట్స్ వాడుతున్నట్లున్నాడు. ఈ  పానీపూరీలను కస్టమర్లకు సర్వ్ చేసే విధానం కూడా చాలా బాగుంది. ఇలా సరికొత్తగా తన పానీపూరీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు గుజరాతీ వ్యాపారి. 

వీడియో


 

click me!