Viral Video: యజమానిపై ఎంత ప్రేమ.. హత్తుకొని ఏడ్చేసిన మేక..!

Published : Jul 19, 2022, 11:49 AM IST
 Viral Video: యజమానిపై ఎంత ప్రేమ.. హత్తుకొని ఏడ్చేసిన మేక..!

సారాంశం

ఓ వ్యక్తి తన మేకను అమ్మేస్తే.. అది ప్రేమగా అతనని హత్తుకొని ఏడ్చేసింది. ఈ  సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మనుషులకంటే జంతువులకు విశ్వాసం ఎక్కువ. ఈ మాట చాలా మంది నోట మీరు వినే ఉంటారు. అయితే.. ముఖ్యంగా ఈ మాట పెంపుడు కుక్కల విషయంలో ఎక్కువ వింటూ ఉంటాం. అయితే.. కేవలం కుక్కలకు మాత్రమే కాదు.. మనం ప్రేమగా చూసుకుంటే.. ఏ జంతువైనా మనపై అంతే ప్రేమ చూపిస్తుంది అని  ఓ మేక నిరూపించింది. ఓ వ్యక్తి తన మేకను అమ్మేస్తే.. అది ప్రేమగా అతనని హత్తుకొని ఏడ్చేసింది. ఈ  సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. ఇటీవల బక్రీద్ పర్వదినం సందర్భంగా  ఓ వ్యక్తి తాను పెంచిన మేకను మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. మంచి బేరం కుదరగానే వెంటనే మరో వ్యక్తికి అమ్మేశాడు. డబ్బులు కూడా తీసుకున్నాడు. అయితే.. ఆ మేక మాత్రం.. తన యజమానిపై ప్రేమ చూపించింది.  అమ్ముతున్న సమయంలో మేక ఏడ్వడం మొదలుపెట్టింది.

 

అంతేకాదు.. యజమానికి హత్తుకొని మరీ ఏడ్వడం విశేషం. మేక యజమానిపై చూపించిన ప్రేమకు.. దాని కన్నీరు చూసి అక్కడున్నవారందరి మనసు చలించింది. అక్కడున్నవారందరి కళ్ల నుంచి నీరు కారడం విశేషం. యజమాని కూడా దాని ప్రేమకు కరిగిపోయాడు. దానిని హత్తుకొని అతను కూడా ఏడ్చేశాడు. అంతే.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. మేక చూపించిన ప్రేమకు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు