
goa election news 2022 : గోవా (gao)లో ఎన్నికలకు ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ (bharathiya janatha party -bjp)కి ఓటు వేయొద్దని నిర్ణయించుకుంటే.. ఆ ఓట్లను కాంగ్రెస్ కు వేయొద్దని అరవింద్ కేజ్రీవాల్ గోవా ప్రజలను కోరారు. చివరకు కాంగ్రెస్ (congress) ఎమ్మెల్యేలంతా కాషాయ పార్టీలో చేరతారని ఆయన వాదించారు.
గోవా (goa)లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోనే రాష్ట్రంలో మైనింగ్ ప్రారంభిస్తామని ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మార్చి 10వ తేదీన గోవాలో ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, మార్చి 11 తరువాత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని ఆయన ప్రకటించారు. ‘‘ కాబట్టి బీజేపీ ఓడిపోవాలని కోరుకునే గోవా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దు. వారి ఓటు వృథా అవుతుంది. అది తిరిగి బీజేపీకి వెళ్తోంది. మీ ఓట్లన్నీ ఆప్‌కి ఇవ్వండి ’’ అని ఆయన అన్నారు. “ మేము గెలిచి, అధికారం చేపట్టిన 6 నెలల్లో మైనింగ్ (mining) ప్రారంభిస్తామని గోవా ప్రజలకు ఆప్ హామీ ఇస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మైనింగ్ నిలిపివేశారు. కాబట్టి వారికి ఓటు వేయకండి. ఆప్ కు ఓటు వేయండి. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి ’’ అని ఆయన అన్నారు.
గోవాలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉత్తరాఖండ్ (utharakhand)లోని 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు చిన్న రాష్ట్రాల్లో ఈ సారి ఎలాగైనా అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ రెండు రాష్ట్రాలపై అరవింద్ కేజ్రీవాల్ దృష్టి సారించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గ్రామాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు, పాఠశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఉద్యోగాల కోసం యువత వలసలు వెళ్లకుండా ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు.
‘‘ ఉత్తరాఖండ్ లో వలసలు ఆగిపోయేలా ఆప్ తగిన ఉపాధి అవకాశాలను తీసుకువస్తుందని నేను ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ నివసిస్తున్న యువతకు, వలస వచ్చిన వారికి సరిపోయే ఉద్యోగాలను సృష్టిస్తాము. వలస వెళ్లిన వారిని తిరిగి ఉత్తరాఖండ్ కు తీసుకురావడమే మా లక్ష్యం.’’ అని ఆయన అన్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ (utharapradhesh), ఉత్తరాఖండ్ (utharakhand), పంజాబ్ (punjab), గోవా (goa), మణిపూర్ (manipur) రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.