goa assembly election 2022 : పారికర్ కుమారుడికి బీజేపీ రెండు సీట్ల ఆఫ‌ర్ - గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్

By team teluguFirst Published Jan 21, 2022, 9:05 AM IST
Highlights

గోవా దివంగత సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కు బీజేపీ రెండు సీట్లు ఆఫర్ చేసిందని ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. ఈ అంశాన్ని ఉత్పల్ తప్పకుండా పరిశీలిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. 

గోవాలో (goa) రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. గోవా దివంగ‌త సీఎం మ‌నోహ‌ర్ పారిక‌ర్ (manohar parikar) కుమారుడు ఉప్తాల్ (upthal) కు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వ‌బోమ‌ని మొన్న‌టి వ‌ర‌కు చెప్పిన బీజేపీ.. నిన్న త‌న మాట‌ను స‌వ‌రించుకుంది. ఏకంగా రెండు సీట్లు ఆఫర్ చేసింది. ఈ విష‌యాన్ని గోవా సీఎం ప్ర‌మోద్ సావంత్ (goa cm pramod sawanth) ధృవీక‌రించారు. 

గోవా మాజీ సీఎం మ‌నోహ‌ర్ పారికర్ కుమారుడు ఉత్ప‌ల్ పారిక‌ర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (bjp) నుంచి పనాజీ (panaji) స్థానానికి టికెట్ ఆశించారు. కానీ ఇది ఇవ్వ‌డానికి బీజేపీ నిరాక‌రించింది. ఈ నేప‌థ్యంలో వివాదం నెల‌కొంది. దీనిని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని ఆప్ (aam admi party) ప్ర‌య‌త్నిస్తోంది. ఉత్ప‌ల్ పారిక‌ర్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరితే ప‌నాజీ టికెట్ ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేసింది. ఇది బీజేపీకి వ్య‌తిరేకంగా మారే అవ‌కాశం ఉండ‌టంతో ఆ పార్టీ నేత‌లు ఆలోచ‌న‌ల్లో ప‌డ్డారు. 

ప‌నాజీ సీటు విష‌యంలో సందిగ్ధం నెల‌కొన‌డంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రించ‌డానికి కేంద్ర నాయ‌క‌త్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఉత్పల్ కు రెండు సీట్లు ఆఫ‌ర్ చేసిన‌ట్టు చెప్పారు. ‘‘బీజేపీ కేంద్ర నాయకులు ఉత్పల్‌తో టచ్‌లో ఉన్నారు. గోవాలో ఎన్నికల్లో పోటీ చేయడానికి రెండు సీట్లు ఆఫర్ చేశారు. ఈ సమస్య పరిష్కారమవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఈ ఆఫర్ ను ఆయ‌న త‌ప్ప‌కుండా ప‌రిశీలిస్తారు’’ అని ఆయ‌న తెలిపారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (delhi cm arvind kejriwal)  తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతి అంశంలోనూ ప్రకటనలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేజ్రీవాల్ గోవాలో ఒక ర‌కంగా, ఢిల్లీలో మ‌రో ర‌కంగా మాట్లాడుతారు. ఇలాంటి నాయకుల‌ను ప్రజలు గుర్తిస్తారని  అనుకుంటాన‌ని తెలిపారు. 

గోవాలో అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల కోసం అధికార బీజేపీ త‌న 34 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితా గురువారం విడుద‌ల చేసింది. అయితే ఇందులో ఉత్ప‌ల్ పేరు లేదు. గ‌తంలో ఉత్పల్ తన తండ్రి స్థానం పనాజీ (పంజిమ్) నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించాడు. అయితే ఆ స్థానంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అటానాసియో బాబుష్ మాన్‌సెరేట్‌ (atanasiyo babush maanseret) ను ఎంపిక చేశారు. ఆయ‌న గతంలో కాంగ్రెస్ ఉన్నారు. . ఓ టీనేజర్‌పై 2016లో లైంగికదాడి చేసిన కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. గోవాలో దాదాపు అన్ని స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఎవరైనా సరే.. గెలిచేవారినే అభ్యర్థిగా ఎంచుకోవాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. బాబుష్ మాసరెట్ ఇది వరకు పంజిమ్ నుంచి గెలిచిన చరిత్ర ఉన్నది. ఆయనకు ఈ చుట్టుపక్కల్లో మంచి పలుకుబడి ఉన్నది. అదీగాక, కేవలం ఒక దివంగ‌త నేత కుమారుడు అయినంత మాత్రానా టికెట్ ఇవ్వాలనీ ఏమీ లేదని యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.

click me!