up assembly election 2022 : మాకు అధికారమిస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం- అఖిలేష్ యాదవ్

By team teluguFirst Published Jan 20, 2022, 5:28 PM IST
Highlights

యూపీలో సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన పార్టీ ఆఫీసు నుంచి మీడియాతో మాట్లాడారు. యశ్ భారతి అవార్డులను తిరిగి ప్రారంభించడంతో పాటు బీపీఎల్ కింద ఉన్న కుటుంబాలకు రూ.18 వేల ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. 

యూపీ (uthara pradhesh) ) అసెంబ్లీ ఎన్నికల్లో త‌మ పార్టీకి అధికారం క‌ట్ట‌బెడితే పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) అన్నారు. గురువారం ఆయ‌న ల‌క్నోలోని ఆ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారని ఆయ‌న తెలిపారు. అలాగే బీపీఎల్ కింద ఉన్న కుటుంబాల‌కు, మ‌హిళ‌ల‌కు ఒక్కొక్కరికి రూ.18 వేలు ఆర్థిక సహాయం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఈ ప‌థ‌కం కింద ఇంత వ‌ర‌కు రూ. 6 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నార‌ని తెలిపారు. కానీ బుందేల్‌ఖండ్‌లో ఒక్క కుటుంబం కూడా దీని ప్ర‌యోజ‌నాలు అందుకోలేద‌ని అన్నారు. అజంగఢ్ ప్రజల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఎన్నికల్లో పోటీ చేస్తానని అఖిలేష్ యాదవ్ తెలిపారు.

త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డితే యశ్ భారతి (yash bharathi) అవార్డులను కూడా తిరిగి అఖిలేష్ యాదవ్ అన్నారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిని సత్కరించేందుకే యశ్‌భారతి అవార్డులను ఏర్పాటు చేసినట్లు ఆయ‌న చెప్పారు. ఇంత వ‌ర‌కు యశ్ భారతి అవార్డు గ్రహీతలలో హరివంశ్ రాయ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, నసీరుద్దీన్ షా, రాజ్ బబ్బర్, నదీరా బబ్బర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు ఉన్నారు. భజన్ గాయకుడు అనుప్ జలోటా, గీత రచయిత సమీర్, గాయని రేఖా భరద్వాజ్, శాస్త్రీయ గాయకుడు రాజన్, సాజన్ మిశ్రా, ఒలింపియన్ అశోక్ కుమార్, పరమవీర్ చక్ర అవార్డు గ్రహీత యోగేంద్ర సింగ్ యాదవ్ కూడా ఈ అవార్డును అందుకున్నారు.

ఇదిలా ఉండ‌గా.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ (mulayam singh yadav) కోడలు అపర్ణా యాదవ్ (aparna yadav) బుధవారం బీజేపీలో (bjp) చేరిన విషయం చేరారు. దీంతో స‌మాజ్ వాదీ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆమె ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ భార్య‌. పార్టీలో చేరిక సంద‌ర్భంగా అపర్ణా యాదవ్ మాట్లాడారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prime minister narendra modi) అంటే త‌న‌కు అభిమాన‌మ‌ని అన్నారు. దేశ ప్రయోజనాలే మోడీకి మొద‌టి ప్రాధాన్యత అని అన్నారు. అయితే అసెంబ్లీ సంద‌ర్భంగా స‌మాజ్ వాదీ పార్టీ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌నుకుంటున్న స‌మ‌యంలో కుటుంబంలో చీల‌క  రావ‌డం రాష్ట్ర రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశం అయ్యింది. అప‌ర్ణా యాద‌వ్ 2017  అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌పై లక్నో కాంట్ నుండి పోటీ ఓడిపోయారు. 

యూపీలో 7 దశల అసెంబ్లీ ఎన్నికలు
ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతాయ‌ని  కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 312 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని భారీ విజయం సాధించింది. 403 మంది సభ్యులున్న అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ 39.67 శాతం ఓట్లను సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లు, బీఎస్పీ 19 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 7 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది.

click me!