ఛాయ్ తాగి.. గ్లాసును కూడా గుటకేశాడు.. అది కడుపులోకి వెళ్లి.. గందరగోళం... చివరికి...

Published : Feb 22, 2022, 12:54 PM IST
ఛాయ్ తాగి.. గ్లాసును కూడా గుటకేశాడు.. అది కడుపులోకి వెళ్లి.. గందరగోళం... చివరికి...

సారాంశం

బీహార్ లో ఓ వ్యక్తి ఛాయ్ తాగాడు.. దాంతో ఆగలేదు.. హాయిగా ఆ తాగిన గ్లాసును కూడా గుటకేసేశాడు.. ఇంకేముంది ఆ గాజా గ్లాసు కాస్త పొట్టలో దూరింది. దీంతో పొట్టలోని అవయవాలు కంగారు పడి.. అటూ, ఇటూ షిఫ్ట్ అవుతూ కడుపునొప్పి కలిగించాయి.. చివరికి... 

బీహార్ : చిన్నారులు ఆడుకుంటూ ఏదో నోట్లో పెట్టుకోవడం.. అది కాస్తా మింగడమో.. గొంతులో అడ్డుపడడమో.. దీంతో పరిస్థితి విషమంగా మారడం లాంటి ఘటనలు చాలానే వింటుంటాం. ఇలాంటి వాటిల్లో ముఖ్యంగా పావలా, రూపాయి బిళ్లలు, చాక్లెట్లు, సపోటా గింజలు.. చింతపిక్కలు లేదా.. కాటుక డబ్బాలు, చిన్నగా ఉండే మెంథోప్లస్ డబ్బాల్లాంటివి ఉంటాయి.

ఎంతగా చెప్పుకునా ఇవి ఒక ఇంచుకు మించి ఉండవు. పైగా గొంతులో అడ్డుకుంటాయి కానీ... కిందికి జారవు. కానీ ఓ వ్యక్తి ఏకంగా ఛాయ్ గ్లాసునే మింగేశాడు. అది అతని నోట్లోకి వెళ్లి.. గొంతులో దూరి.. చకచకా కిందికి జారి కడుపులో సెటిల్ అయ్యింది. అదెలా సాధ్యం అంటారా? డాక్లర్లు.. ఈ విషయం విన్నావారూ ఇప్పుడు అదే సందేహంతో జుట్టు పీక్కుంటున్నారు. వివరాల్లోకి వెడితే.... 

బీహార్ లో ఓ విచిత్రమైన ఘటన జరిగింది. ఇది బీహార్ రాష్ట్రం ముజఫర్ పుర్ జిల్లాలో ఓ గమ్మత్తైన కేసు వెలుగుచూసింది. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని పరిశీలించిన వైద్యులకు ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. అతని కడుపులో గ్లాసు ఉందని గుర్తించారు. అది కూడా గాజు గ్లాసు కావడంతో షాక్ తిన్నారు. అసలు ఆ గ్లాసు ఆయన కడుపులోకి ఎలా వెళ్లిందో తెలియక తికమక పడ్డారు.

ముందుగానైతే శస్త్రచికిత్స చేసి ఆ గ్లాసును కడుపులోనుంచి తొలగించారు. జిల్లాలోని మడిపూర్ ప్రాంతానికి చెందిన 55 యేళ్ల వ్యక్తి తీవ్రమైన కడుపునొప్పితో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. వెంటనే వైద్యులు అతనికి ఎక్స్-రే తీయగా.. బాధితుడి కడుపులో గ్లాసు ఉన్న సంగతి తెలిసింది. 

దానికి తీయడానికి మొదట ఎండోస్కోపీ ద్వారా విఫలయత్నం చేశారు. చివరకు శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఈ విషయం మీద బాధితుడిని ఆరా తీయగా.. అతను మాట్లాడుతూ ఛాయ్ తాగేప్పుడు పొరపాటున గ్లాసు మింగేశానని తాపీగా సమాధానం చెప్పాడు. ఇంతకీ అలా మింగడం.. అది గొంతులో పట్టడం సాధ్యమేనా..? అసలు అలా ఎలా జరిగింది. చిన్న చింతపిక్క ఇరుక్కుంటేనే ఊపిరి ఆడకుండా పోతుందే.. అలాంటిది.. గ్లాసు ఎంత చిన్నదైనా సరే ఎలా గొంతులోకి జారింది.. అనేది ఇప్పుడు హండ్రెడ్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. 

ఇదిలా ఉండగా, ఈ ఫిబ్రవరి 12న తమిళనాడులో ఓ చిన్నారి ఇలాగే చిన్న కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోయాడు. గొంతులో coconutముక్క ఇరుక్కుని మూడున్నరేళ్ల బాలుడు శుక్రవారం మృతి చెందాడు. పొన్నేరి సమీపంలోని పాక్కం గ్రామానికి చెందిన వసంత్ కు మూడున్నరేళ్ల కొడుకు సంజీశ్వరన్ ఉన్నాడు. ఇంట్లో వంట చేయడం కోసం కొబ్బరిని pieces చేసి ఉంచారు. ఈ క్రమంలో అక్కడే ఆడుకుంటున్న సంజీశ్వరన్ ఆ కొబ్బరి ముక్కలను తిన్నాడు.

అవి పెద్దగా ఉండడంతో throatలో ఇరుక్కుపోయి.. స్పహ కోల్పోయాడు. తల్లిదండ్రులు వెంటనే చెన్నై స్టాన్లీ Government Hospitalకి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపాలైవనం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇలాంటి ఘటనే నిరుడు జూన్ లో అస్సాంలో జరిగింది. లిచీ పండు గింజ గొంతులో ఇరుక్కుని 16యేళ్ల బాలిక మృత్యువాతపడింది

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌