Maharashtra BJP: సీఎం ఉద్ద‌వ్ థాక‌రేను గద్దె దించే కుట్ర! మహారాష్ట్ర బీజేపీ ఆరోప‌ణ‌లు

Published : Feb 22, 2022, 12:08 PM IST
Maharashtra BJP: సీఎం ఉద్ద‌వ్ థాక‌రేను గద్దె దించే కుట్ర! మహారాష్ట్ర బీజేపీ ఆరోప‌ణ‌లు

సారాంశం

Maharashtra BJP: ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో శివసేన నేత సంజయ్ రౌత్ కుమ్మక్కయ్యారని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచ‌ల‌న ఆరోపించారు. శివసేన ఎంపి సంజయ్ రౌత్ ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ ఎజెండాలో పనిచేస్తున్నారని, ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, రౌత్‌ను సీఎం చేయాల‌ని కుట్ర జ‌రుగుతోంద‌ని చంద్రకాంత్ పాటిల్  పేర్కొన్నారు.  

Maharashtra BJP: మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ సంక్షోభం ఏర్పడ‌బోతుంద‌నీ, సీఎం ఉద్ద‌వ్ థాక‌రేను గ‌ద్దె దించాల‌ని కుట్ర జ‌రుగుతోంద‌ని మహారాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఆరోపించారు. ఉద్ధవ్ థాకరే స్థానంలో సీఎంగా.. శివసేన ఎంపి సంజయ్ రౌత్ ను చేయాల‌ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్ కుట్ర చేస్తున్నార‌ని ఆరోపించారు. అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ఎజెండా ప్ర‌కార‌మే..  శివసేన ఎంపి సంజయ్ రౌత్ పనిచేస్తున్నారని చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు.

మహారాష్ట్ర బిజెపి చీఫ్ చంద్రకాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ..  త‌న అంచ‌నా ప్ర‌కారం.. సీఎం ఉద్ద‌వ్ ను గ‌ద్దె దించాల‌ని కుట్ర ప్రారంభ‌మైంది. ఈ మేర‌కు సంజయ్ రౌత్, శరద్ పవార్ పావులు క‌దుపుతున్నారు. వారి ఒప్పందం ప్ర‌కారం.. ఉద్ధవ్ సిఎంగా 2.5 సంవత్సరాలు పూర్తి చేసారు.  దీంతో వారు ఉద్ద‌వ్ ను తొలగించాలనుకుంటున్నారని ఆరోపించారు.

శరద్ పవార్ కుమార్తె, లోక్‌సభ ఎంపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే ను సీఎం చేయాల‌ని భావించినా ప‌రిణామాలు వేరుగా ఉన్నాయ‌నీ, దీంతో  నేరుగా సంజయ్ రౌత్ ను సీఎం చేయాల‌ని,  చివరి ఏడాదిలో సుప్రియ సూలే సీఎం చేయాల‌ని భావిస్తున్నారు. ఉద్ద‌వ్ భావించినా, భావించ‌గా పోయినా.. అత‌డు త‌మ‌ స్నేహితుడు. ఆయన శివసేన అధినేత దివంగత బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడు. బీజేపీ, శివ‌సేన‌లు క‌లిసి చాలా రోజులు ప‌నిచేశాయి. ఆ అనుబంధాన్ని మ‌రిచిపోలేం.. అని పాటిల్ అన్నారు.

ఇంత‌కీ సంజయ్ రౌత్ ఎవరు? ఇప్పుడూ శివసేనలోకి వచ్చి ఎవరికి బోధిస్తున్నాడు? అని ఆరోపించారు. ప్ర‌స్తుతం ప‌రిస్థితుల ప్ర‌కారం..  పవార్ సాహెబ్ ఎజెండా ప్ర‌కారం..  రౌత్ పనిచేస్తున్నారని,  ఈ విష‌యం ఉద్ధవ్‌జీకి చెప్పాలనుకుంటున్నామనీ, సిఎంగా రెండున్నరేళ్లు పూర్తి చేసినందున మిమ్మల్ని ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించడమే ప‌వార్ ఎజెండా అని పాటిల్ ఆరోపించారు. సుప్రియా సూలేను సిఎంగా చేయలేరు.. ప‌వార్ అనుకునంగా ఉన్న వ్య‌క్తిని(రౌత్) ను  ముఖ్యమంత్రిని చేయాల‌ని భావిస్తున్నార‌ని పాటిల్ ఆరోపించారు.

ఇదే త‌రుణంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)పై విమర్శలు గుప్పించారు.  ఉద్ధవ్ ఠాక్రే తన ప్రభుత్వంలో ఎవరినీ నమ్మడం లేదని, ముఖ్యమంత్రి తన కుమారుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు బాధ్యతలు అప్పగించాలని భావించిన జ‌ర‌గ‌ని ప‌రిస్థితి అని ఆరోపించారు. 

2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ముఖ్యమంత్రి పదవిని పంచుకునే అంశంపై శివసేన దీర్ఘకాలిక మిత్రపక్షమైన బిజెపితో బంధాన్ని తెంచుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు థాకరే నేతృత్వంలోని పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో పొత్తు పెట్టుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu