అబ్బాయిలతో బాతాఖానీలు, ఆపై లేచిపోతున్నారు.. ఫోన్ల వల్లే ఇదంతా: యూపీ మహిళా కమీషన్ సభ్యురాలి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jun 10, 2021, 3:36 PM IST
Highlights

ఆడపిల్లలు ఫోన్లు ఎక్కువగా వాడటం వల్లే అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్ల వారు ఫోన్లు అతిగా వాడొద్దని ఆమె సలహా ఇచ్చారు. అలీగఢ్ జిల్లాలో మహిళా ఫిర్యాదులపై విచారణల సందర్భంగా మీనా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆమె ఏమన్నారంటే.. ‘‘ అమ్మాయిల చేతికి అసలు ఫోన్లు ఇవ్వొద్దు.. గంటలకొద్దీ అబ్బాయిలతో ముచ్చట్లు పెడుతుంటారు. ఆ తర్వాత వారితో కలిసి పారిపోతున్నారు.. తల్లిదండ్రులు వారి ఫోన్లను చెక్ చేయకపోవడం వల్ల ఇలాంటి విషయాలు బయటకు రావడం లేదని వ్యాఖ్యానించారు. మహిళలపై పెరుగుతున్న నేరాలపై సమాజం కూడా ప్రభావం చూపిస్తోందని మీనా ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:మామతో అక్రమసంబంధం, అత్తను చంపి.. కాల్చి, ఇంట్లో పాతిపెట్టిన కోడలు..

తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు.. తమ కుమార్తెలను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె సూచించారు. కూతుర్లు నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే దానికి కారణం తల్లులేనని మీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అన్ని వైపుల నుంచి మీనాపై విమర్శలు వస్తున్నాయి. అటు మీనా వ్యాఖ్యలపై స్పందించిన కమిషన్ వైస్ చైర్ పర్సన్ అంజూ చౌదరి.. ఫోన్లను లాక్కున్నంత మాత్రాన మహిళలపై లైంగిక హింస ఆగదని గుర్తుచేశారు.
 
click me!