వాష్ రూంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు

Published : Aug 10, 2018, 09:52 AM ISTUpdated : Sep 09, 2018, 10:49 AM IST
వాష్ రూంలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు

సారాంశం

అమ్మాయిల వాష్ రూంలోకి వచ్చి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించి పారిపోయాడు. పట్టపగలే యూనివర్శిటీ ఆవరణలోని వాష్ రూంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. 

వాష్ రూంలో విద్యార్థిని లైంగిక వేధింపులకు గురైన సంఘటన  ముంబయిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..ముంబై యూనివర్శిటీలోని కలీనా క్యాంపస్ వాష్ రూంలో  ఓ ఆగంతకుడు తనను లైంగికంగా వేధించాడని ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థిని ఫిర్యాదు మేర యూనివర్శిటీ రిజిస్ట్రార్ విచారణ జరపాలని వర్శిటీ మహిళా విభాగాన్ని ఆదేశించారు. 

గుర్తుతెలియని యువకుడొకరు అమ్మాయిల వాష్ రూంలోకి వచ్చి ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించి పారిపోయాడు. పట్టపగలే యూనివర్శిటీ ఆవరణలోని వాష్ రూంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. 

150 ఏళ్ల యూనివర్శిటీలో విద్యార్థినులకు రక్షణ కొరవడిందని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించ లేక పోయామని వర్శిటీ రిజిస్ట్రార్ దినేష్ కాంబ్లే చెప్పారు. నిందితుడిని గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?