వ్యాయామం చేస్తూ.. పదో అంతస్తు నుంచి జారి కిందపడి..!

Published : Aug 06, 2021, 01:35 PM IST
వ్యాయామం చేస్తూ.. పదో అంతస్తు నుంచి జారి కిందపడి..!

సారాంశం

ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ పది అంతస్తులు కాగా.. ఆమె తన సోదరుడితో కలిసి టెర్రస్ పైకి ఎక్కి వ్యాయామం చేస్తోంది.

వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ.. ఈ అమ్మాయి విషయంలో ఆ వ్యాయామమే.. యమ పాశమైంది. వ్యాయామం చేస్తూ.. ఓ 18ఏళ్ల యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన ఇరైన్ జాయ్(18) అనే యువతి శాంతి తోటేకాట్ ఎస్టేట్స్ లో  నివసిస్తోంది.  ఆమె నివసిస్తున్న అపార్ట్ మెంట్ పది అంతస్తులు కాగా.. ఆమె తన సోదరుడితో కలిసి టెర్రస్ పైకి ఎక్కి వ్యాయామం చేస్తోంది. 

ఆ సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారింది.. దీంతో... యువతి పదో అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లోని ఓ కారు పై పడింది. దీంతో... యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు స్పందించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు చెప్పారు.

పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని.. పరిశీలించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఏడాదిలో ఏర్నాకుళంలో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం రెండోదని పోలీసులు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌