ఐబీ, సీబీఐ సహకరించడం లేదు: సీజేఐ ఎన్వీ రమణ సంచలనం

By narsimha lodeFirst Published Aug 6, 2021, 12:49 PM IST
Highlights

జార్ఖండ్ ధన్‌బాద్  అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ అనుమానాస్పద మృతిపై  విచారణ సమయంలో సుప్రీంకోర్టు  చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐబీ, సీబీఐలు న్యాయమూర్తులకు సహకరించడం లేదన్నారు.

న్యూఢిల్లీ: ఐబీ, సీబీఐ అధికారులు సహకరించడం లేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.జార్ఖండ్ జడ్జి అనుమానాస్పద మృతిపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణను చేపట్టింది. శుక్రవారం నాడు ఈ కేసుపై  విచారణ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు.అనుకూలంగా తీర్పు రాకపోతే న్యాయవ్యవస్థను  కించపర్చడం బాధాకరమన్నారు. ఫిర్యాదులు చేసినా కూడ  పోలీసులు, సీబీఐ అధికారులు స్పందించడం లేదన్నారు. జార్ఖండ్ జడ్జి  అనుమానాస్పద మృతిపై సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

also  read:జార్ఖండ్ జ‌డ్జి హ‌త్య‌ కేసు.. రంగంలోకి సీబీఐ, ధన్‌బాద్‌కి ప్రత్యేక బృందాలు

జార్ఖండ్ ధన్‌బాద్ కు చెందిన అడిషనల్ జిల్లా జడ్జి  ఉత్తమ్ ఆనంద్  జూలై 28వ తేదీన గుర్తు తెలియని వాహనం డీకొట్టి మృతి చెందాడు. అయితే  ఉద్దేశ్యపూర్వకంగానే జడ్జిని వాహన డ్రైవర్ ఢీకొట్టాడని పోలీసులు అనుమానిస్తున్నారు.ఉన్నతస్థాయి వ్యక్తులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ కానీ సమయంలో  న్యాయవ్యస్థను అపవిత్రం చేసే ధోరణి నెలకొందన్నారు. ఐబీ, సీబీఐ న్యాయవ్యవస్థకు సహాయం చేయడం లేదన్నారు. న్యాయమూర్తులు ఫిర్యాదు చేసినా కూడ స్పందించడం లేదన్నారు.


సోమవారం నాడు సీబీఐ అధికారులు కోర్టుకు హాజరు కావాలని సీజేఐ ఆదేశించారు. దేశంలో ఇదొక పెడధోరణి మొదలైందన్నారు. మాఫియా గ్యాంగ్‌స్టర్లు తమకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులపై దాడులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ లో జడ్జి హత్య ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

గత మాసంలో జార్ఖండ్ లోని ధన్‌బాద్ కు చెందిన అదనపు జిల్లా జడ్జి అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇది న్యాయ స్వాతంత్ర్యంపై దాడిగా బార్ అసోసియేషన్ అభిప్రాయపడింది. న్యాయమూర్తులు సురక్షితంగా ఉంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉంటుందని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  వికాస్ సింగ్ చెప్పారు.ధన్‌బాద్ లో అనేక మాఫియా హత్యల కేసులను జడ్జి ఆనంద్ విచారణ చేస్తున్నారు.  ఇద్దరు గ్యాంగ్‌స్టర్ బెయిల్ అభ్యర్ధనలను ఆనంద్ తిరస్కరించారు. ఎమ్మెల్యే  సంజీవ్ సింగ్ సన్నిహితుడు రంజయ్ సింగ్ హత్య కేసు కూడ  కోర్టులో నడుస్తుంది. ఈ హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.

 

click me!