సుజిత్ న్యూస్ చూస్తున్న పేరెంట్స్... నీటిలో పడిన రెండేళ్ల చిన్నారి..

By telugu teamFirst Published Oct 29, 2019, 5:15 PM IST
Highlights

కాసేపటి తర్వాత తమ చిన్నారి తమ వద్దలేదని గుర్తించిన తల్లిదండ్రులు... చిన్నారి కోసం గాలించారు. కాగా... ఇంటి ఆవరణలోని టబ్బులో చిన్నారి విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు సుజిత్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా... ఆ బాలుడుకి సంబంధించిన వార్తలను టీవీలో చూస్తూ.... ఓ తల్లిదండ్రులు తమ కన్నబిడ్డను పోగొట్టుకున్నారు. వీరు టీవీలో మునిగిపోయిన సమయంలో వారి రెండేళ్ల చిన్నారి నీటి టబ్బులో పడి ప్రాణాలు కోల్పోయింది.  ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... తమిళనాడు రాష్ట్రం తెరసుపూరమ్ గ్రామానికి  చెందిన ఓ దంపతులు టీవీలో మునిగియారు. టీవీలో బోరుబావిలో పడి ప్రాణాలు కోల్పోయిన చిన్నారి సుజీత్ కి సంబంధించిన వార్తలను వారు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారి చిన్నారి రెండేళ్ల రేవతీ సంజన... ఆడుకుంటూ వెళ్లి నీటి టబ్బులో పడిపోయింది.

కాసేపటి తర్వాత తమ చిన్నారి తమ వద్దలేదని గుర్తించిన తల్లిదండ్రులు... చిన్నారి కోసం గాలించారు. కాగా... ఇంటి ఆవరణలోని టబ్బులో చిన్నారి విగత జీవిగా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 

తిరుచ్చి జిల్లా నడుకాట్టుపట్టికి చెందిన సుజిత్ శుక్రవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ సుమారు 600 అడుగుల లోతైన బోరు బావిలో పడిన సంగతి తెలిసిందే.. 

బోరు బావిలో పడిన రెండేళ్ల చిన్నారి సుజిత్ ను వెలికి తీసేందుకు గాను తిరుచ్ఛిపల్లి, కోయంబత్తూరు, మధురై నుండి నిపుణుల బృందం వచ్చింది.పసిబాలుడి నడుము చుట్టూ తాడును బిగించి  బోరు బావి నుండి వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. మూడు దఫాలు ఈ రకంగా చేసిన ప్రయత్నాలు విపలమయ్యాయి. 

సుజిత్ ను బోరు బావి నుండి వెలికితీసేందుకు గాను బోరు బావి పక్కనే సమాంతరంగా మరో సొరంగం తవ్వుతున్న సమయంలో సుజిత్ విల్సన్  బోరు బావిలో మరింత కిందకు జారిపోయినట్టుగా  తమిళనాడు రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

తొలుత 27 అడుగుల లోతులో ఉన్న సుజిత్ విల్సన్ ఆ తర్వాత 70 అడుగుల  లోతులోకి కూరుకుపోయినట్టుగా మంత్రి  విజయభాస్కర్ చెప్పారు.బోరు బావిలో పడిన సుజిత్ విల్సన్ ను బయటకు తీసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ పోర్స్, ఎన్‌ఎల్‌సీ సిబ్బంది బోరు బావిలో పడిన బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి విజయభాస్కర్ ప్రకటించారు.

బోరు బావిలో పడిపోయిన బాలుడిని సజీవంగా ఉంచేందుకు ఆక్సిజన్ ను నిరంతరరాయంగా సరఫరా చేస్తున్నామని మంత్రి ప్రకటించారు.శనివారం నాడు ఉదయం నుండి ఆ బాలుడి శబ్దాలు తాము వినలేదని రెస్క్యూ సిబ్బంది ప్రకటించారు. బాలుడిని రక్షించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.

click me!