ఉగ్రవాదుల టార్గెట్ ...ప్రధాని మోదీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ

By telugu team  |  First Published Oct 29, 2019, 4:59 PM IST

ఈ లిస్ట్ అందడంతో ఒక్కసారిగా బోర్డు అప్రమత్తమైంది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరికి భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. మ్యాచ్‌లు జరిగే మైదానాల్లో కూడా భద్రతను మరింత పెంచనుంది.


దేశ ప్రధాని నరేంద్రమోదీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ విషయాన్ని ఇంటిలిజెన్స్ అధికారులు ధ్రువీకరించారు. బంగ్లాదేశ్ తో అరుణ్ జైట్లీ మైదానంలో జరిగే తొలి టీ20లో టీమిండియా క్రికెటర్లకు భద్రతను పెంచాలని ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.

కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా భారత క్రికెటర్లందరకీ ఉగ్రముప్పు ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి ఓ ఆకాశ రామన్నఉత్తరం అందింది. దానవలో ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, హోంశాఖ మంత్రి అమిత్ షా ,  నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్,  బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ పేర్లు కూడా ఈ లేఖలో ఉండటం గమనార్హం.

Latest Videos

undefined

AlsoRead పదేళ్లైనా పిల్లలు కలగడం లేదని...మాంత్రికుడి సలహాతో సొంత మేనల్లుడిని.

ఈ లిస్ట్ అందడంతో ఒక్కసారిగా బోర్డు అప్రమత్తమైంది. ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో ప్రతీ ఒక్కరికి భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. మ్యాచ్‌లు జరిగే మైదానాల్లో కూడా భద్రతను మరింత పెంచనుంది. ఈ ఉత్తరంలో మొదటి పేరు మోదీది కాగా... చివరి పేరు విరాట్ కోహ్లీదని అధికారులు చెబుతున్నారు. 

అయితే గతంలో ఎన్‌ఐఏకి ఇటువంటి లిస్ట్‌లు చాలా సార్లు వచ్చాయి. కానీ అందులో ఓ క్రికెటర్‌ పేరు ఉంటడం మొదటిసారిగా జరిగింది. ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తొయిబా నడిపిస్తున్నట్లు సమాచారం.

కేరళలోని కోళికోడ్ కేంద్రంగా పనిచేస్తున్న అఖిల భారత లష్కర్ ఉగ్రవాద సంస్థ పేరుతో వచ్చిన ఈ ఉత్తరాన్ని బీసీసీఐకి ఎన్ఐఏ పంపించింది. అయితే... ఈ ఉత్తరం నిజం కాదని.. నకిలీదేనని పోలీసులు భావిస్తున్నారు. కాగా నవంబర్ 3వ తేదీ నుంచి బంగ్లాదేశ్ ... భారత్ పర్యటన మొదలౌతుంది. ఆదివారం తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కి పోలీసులు భద్రతను రెట్టింపు చేస్తున్నారు.  


 

click me!