
Food Poisoning In Kerala: కేరళలోని కాసర్ గోడ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులు తమ స్కూల్ పక్కన ఉన్న ఓ హోటల్ లో ప్రముఖ అరబిక్ వంటకం షవర్మాను తిన్నారు. కొందరు అక్కడే ఉన్న జ్యూస్ ను తాగారు. అయితే, కాసేపటికే వారందరూ అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు తీవ్రంగా వాంతులు చేసుకున్నారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే..
ఆస్పత్రికే తరలించే లోపే ఒక బాలిక ప్రాణాలు కోల్పోయింది.
అదే విధంగా, మరో 18 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రులకు తరలి వచ్చారు. ఈ ఘటనకు కారణమైన ఓ హౌటల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఘటనకు ఫుడ్ పాయిజనే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం చిక్సిత పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పాఠశాల యజామాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థిని కరివళ్లూర్కు చెందిన దేవానంద(16)గా గుర్తించారు. కన్హాన్ గడ్లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కలుషిత ఆహారాన్ని అందించిన ఆ హోటల్ పై కేసు నమోదు చేసుకుని.. పుడ్ శాంపుల్స్ తీసుకుని ల్యాబ్ కు తరలించారు. అనంతరం ఆ హోటల్ ను సీజ్ చేసినట్లు చెప్పారు.
కన్హన్‌గడ్‌లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరిన వారందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకురావడంతో వైద్యులు బాలిక ప్రాణాలను కాపాడలేకపోయారని జిల్లా వైద్యాధికారి ఎవి రాందాస్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిని సందర్శించేందుకు వచ్చిన జిల్లా మేజిస్ట్రేట్ భండారీ స్వాగత్ రణవీరచంద్ ఆ తర్వాత అన్ని షావర్మా తయారీ కేంద్రాలపై విచారణకు ఆదేశించారు. అస్వస్థతకు గురైన వారందరూ శుక్రవారం షావర్మా తిన్నట్లు అధికారులు తెలిపారు.