జర్నలిస్టుకు కరోనా వైరస్ పాజిటివ్: క్వారంటైన్ కు నలుగురు మంత్రులు

By telugu teamFirst Published Apr 30, 2020, 8:28 AM IST
Highlights

నలుగురు కర్ణాటక మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు, తను కలిసిన ఓ వీడియో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో మంత్రులు తామంత తాముగా క్వారంటైన్ కు వెళ్లారు.

బెంగళూరు: కర్ణాటకకు చెందిన నలుగురు మంత్రులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఓ స్థానిక టీవీ చానెల్ వీడియో జర్నలిస్టుకు కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో వారు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లారు. నలుగురు మంత్రులు డిప్యూటీ సీఎం డాక్టర్ అశ్వత్థ నారాయణ కూడా ఉన్నారు. తాము స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్లు నలుగురు మంత్రులు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

అశ్వత్థ నారాయణతో పాటు హోం మంత్రి బస్వరాజ్ బొమ్మై, వైద్య విద్య శాఖ మంత్రి డాక్టర్ సుధాకర్, పర్యాటక మంత్రి సీటీ రవి సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లారు. తాము పరీక్షలు చేయించుకున్నామని, పరీక్షల్లో నెగెటివ్ ఉన్నట్లు తేలిందని, అయినప్పటికీ తాము క్వారంటైన్ కు వెళ్తున్నామని వారు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

ఓ వీడియో జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఈ నెల 24వ తేదీన నిర్ధారణ అయింది. అతను మంత్రులను ఏప్రిల్ 21, 24 తేదీల మధ్య కలిశాడు. వీడియో జర్నలిస్టుతో కాంటాక్టులోకి వచ్చన కనీసం 40 మందిని క్వారంటైన్ కు తరలించారు. వారిలో అతని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. 

కర్ణాటకలో ఇప్పటి 532 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది కోవిడ్ -19 పాజిటివ్ తో మరమించారు. ఇప్పటి వరకు 215 మంది రోగులు కోలుకున్నారు. కొన్ని ఆంక్షలతో చామ్ రాజ్ నగర్, కొప్పలు, చిక్ మగళూరు, రాయచూరు, చిత్రదుర్గ, హసన్, శివమొగ్గ, హవేరీ, యాద్గిర్, కోలారు, ఉడుపి, దేవనగరే, కొడుగు జిల్లాల్లో లాక్ డౌన్ ను సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

click me!