Gen Bipin Rawat : ‘పెద్ద శబ్దం.. చూస్తుండ‌గానే .. చెట్లను ఢీకొట్టింది.. వెంట‌నే మంట‌లు: ప్రత్యక్ష సాక్షి

By Rajesh KFirst Published Dec 8, 2021, 5:48 PM IST
Highlights

Gen Bipin Rawat: తమిళనాడు రాష్ట్రంలోని నీల‌గిరి అడ‌వుల్లో కూనురు వ‌ద్ద ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన‌ట్లు స‌మాచారం.  ఈ హెలికాప్టర్‌లో త్రివిధ ద‌ళాధిప‌తి జ‌న‌ర‌ల్ బిపిన్ రావత్ తో పాటు మరో 14 మంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్న‌ట్టు స‌మాచారం. హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని, అసలేం ఏం జరిగిందో తెలుసుకోవడానికి బ‌య‌ట‌కు రాగానే పెద్ద ఎత్తున మంట‌లు చెల‌రేగాయ‌ని ప్ర‌త్యేక్ష సాక్షి తెలిపారు
 

భార‌త‌ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావత్ (CDS Gen Bipin Rawat), ఆయన సిబ్బంది, కుటుంబ సభ్యులతో క‌లిసి ప్ర‌యాణిస్తున్న ఆర్మీ హెలిక్యాప్ట‌ర్ Mi-17V-5 కుప్ప‌కూలింది. ఆ వెంట‌నే హెలికాప్ట‌ర్ నుంచి మంట‌ల చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న కొయంబత్తూర్‌, కూనూరు మధ్యలో జ‌రిగింది. స్థానికుల ద్వారా స‌మాచారం అందుకు అధికారులు వెంట‌నే రంగంలోకి దిగి.. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో బిపీన్ రావత్ కుటుంబ సభ్యులతో స‌హా 14 మంది ప్ర‌యాణించిన‌ట్టు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. అయితే..  ఘటనలో 14 మంది సిబ్బందిలో 13 మంది మరణించినట్లు నిర్ధారించారు. మృతదేహాల గుర్తింపులు DNA పరీక్ష ద్వారా నిర్ధారించడం జరుగుతుందని విశ్వనీయవర్గాల వెల్లడించాయి.

విశ్వసనీయ సమాచారం ప్రకారం..  తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించిన వ్యక్తులలో సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారు. వెల్లింగ్‌టన్‌లోని మిలిటరీ ఆసుపత్రి నుంచి సీరియస్‌గా ఉన్న సైనికాధికారులను ఢిల్లీకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకే ఎయిర్‌ఫోర్స్ తమిళనాడుకు ఎయిర్ అంబులెన్స్‌ను పంపింది. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఈ క్ర‌మంలో సీడీఎస్ ప్ర‌యాణిస్తున్న హెలికాఫ్ట‌ర్ ప్ర‌మాదానికి లోన‌వ‌డంతో వాయుసేన ఉన్న‌తాధికారులు దిగ్బ్రాంతి  వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్ర‌మాదానికి దారితీసిన ప‌రిస్ధితులు, కార‌ణాల‌పై హాట్ డిబేట్ సాగుతోంది.

Read Also: https://telugu.asianetnews.com/national/chopper-crash-at-coonoorcds-bipin-rawat-in-critical-condition-r3sknp
 
ప్రత్యక్ష సాక్షి కృష్ణస్వామి కథనం ప్రకారం.. హఠాత్తుగా పెద్ద శబ్దం వచ్చిందని, అసలేం ఏం జరిగిందో తెలుసుకోవడానికి బ‌య‌ట‌కు రాగానే..  చాపర్‌ చెట్టును ఢీ కొట్టి, మంటలు చెలరేగాయని తెలిపాడు. అదే క్రమంలో హెలికాప్టర్‌ మరో చెట్టును ఢీ కొట్టడం కళ్లారా చూశానని తెలిపాడు. విమానం కూలుతున్న స‌మ‌యంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అందులోని దూక‌డం చూశాన‌ని తెలిపారు.  ఏం జరుగుతుందో అర్థంకాక తాను ఇరుగుపొరుగు వారితో పాటు అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపాడు. వెంట‌నే.. రెస్క్యూ ఆపరేషన్ల కోసం స్థానిక సైనిక అధికారులతో సహా అనేక బృందాలు వెంటనే స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.  
 

click me!