దొంగ బాబా: ఆశ్రమం పేరిట లైంగిక వేధింపులు..

Published : Jun 04, 2021, 07:28 AM IST
దొంగ బాబా:  ఆశ్రమం పేరిట లైంగిక వేధింపులు..

సారాంశం

ఆశ్రమం, స్కూల్ నిర్వహిస్తూ.. అక్కడ చదువుకునే విద్యార్థినులు.. పనిచేసే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవాడు. కాగా.. అతని లీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి

దైవం ముసుగులో అమాయక ఆడపిల్లలు, స్త్రీలను వేధిస్తున్న ఓ దొంగబాబా రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఆశ్రమం, స్కూల్ నిర్వహిస్తూ.. అక్కడ చదువుకునే విద్యార్థినులు.. పనిచేసే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవాడు. కాగా.. అతని లీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

శివశంకర్‌ అలియాస్‌ శివశంకర్‌ బాబా చెంగల్పట్టు జిల్లా కేలంబాక్కం సమీపంలోని రామరాజ్యం పేరిట నగర్‌ ఏర్పాటు చేసుకుని, ఆశ్రమాన్ని, సుశిల్‌ హరి పేరిట ఇంటర్నేషనల్‌ స్కూల్‌ను నడుపుతున్నాడు. పద్మశేషాద్రి స్కూల్లో కీచక టీచర్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి.


ఇద్దరు విద్యార్థినులు శివశంకర్‌ బాబాపై ఫిర్యాదు చేశారు. ఆశ్రమంలో జరిగే పూజలు, నృత్య కార్యక్రమాల్లో బాబా లైంగిక వేధింపులు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసులతోపాటు బాల బాలికలు, శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి రంగస్వామి నేతృత్వంలో బృందం రంగంలోకి దిగింది. గురువారం ఆశ్రమంవద్దకు వెళ్లగా బాబా లేకపోవడంతో ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

మరో వీడియో రిలీజ్ చేసిన మోదీ ఏమన్నారంటే? | PM Narendra Modi Releases Another Video on Exam Reforms
ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌లో కేంద్రం భారీ సంస్క‌ర‌ణ‌లు.. హైప‌వ‌ర్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు