ఇది దారుణం: గురుగ్రామ్‌లో ముస్లిం యువకుడిపై గంభీర్ ఆగ్రహం

By Siva KodatiFirst Published May 27, 2019, 12:03 PM IST
Highlights

గురుగ్రామ్‌లో ముస్లిం యువకుడిపై జరిగిన దాడిని టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ఖండించారు. ఇది చాలా హేయమైన చర్య అని దీనిపై స్థానిక అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు. 

గురుగ్రామ్‌లో ముస్లిం యువకుడిపై జరిగిన దాడిని టీమిండియా మాజీ క్రికెటర్, ఎంపీ గౌతమ్ గంభీర్ ఖండించారు. ఇది చాలా హేయమైన చర్య అని దీనిపై స్థానిక అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాడు.

మనది సెక్యులర్ దేశమని ఇటువంటి చర్యలు మన వ్యవస్థకు మంచివి కాదన్నారు. ప్రధాని నరేంద్రమోడీ సబ్ కా సాత్, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్ అనే నినాదం నుంచి సెక్యులరిజమ్‌పై తన ఆలోచన మారిందని గంభీర్ ట్వీట్ చేశాడు.

కాగా బీహార్‌కు చెందిన మహ్మద్ బర్కర్ ఆలం నమాజ్ చేసేందుకు ఆదివారం గురుగ్రామ్‌లోని స్థానిక సర్దార్ బజార్ వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో నలుగురు యువకులు అతనితో మాట కలిపి.. నువ్వు ధరించిన క్యాప్‌పై పుర్రే గుర్తు ఉంది.. ఇలాంటివి పెట్టుకోకూడదని చెప్పారు.

అంతటితో ఆగకుండా భారత్ మాతా కీ జై అని కోరారు... దీనికి అతను సైతం నినదించాడు. అయితే జై శ్రీరాం అనాలంటూ గద్ధించడంతో మహ్మద్ దానిని తిరస్కరించాడు. దీంతో వారు కర్రలు తీసుకుని కాళ్లు, వెనుక భాగంలో చితకబాదారు.

దెబ్బలకు తట్టుకోలేక అతను గట్టిగా అరవడంతో వారు పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!