ఘోర ప్రమాదం.. ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Published : May 27, 2019, 10:54 AM IST
ఘోర ప్రమాదం.. ఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

సారాంశం

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కన్నుమూసిన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. యెలహంకలోని కొగిలు క్రాస్‌ వద్ద కారు, అంబులెన్స్‌ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కన్నుమూసిన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. యెలహంకలోని కొగిలు క్రాస్‌ వద్ద కారు, అంబులెన్స్‌ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

మృతులను పశ్చిమబెంగాల్‌కు చెందిన దీపక్‌ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. చెన్నైలో ఉంటున్న వీరు తమ బంధువులను కలిసేందుకు బెంగళూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొగిలు క్రాసింగ్‌ వద్ద దీపక్‌ కుటుంబం ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దీపక్‌, సంజయ్‌, ఇదే కుటుంబానికి చెందిన మరో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. 

తీవ్రంగా గాయపడిన మరో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Who is Best PM of India: దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు.. సీజేపీ బాస్ హాట్ కామెంట్స్
ఈ పండ్లు అమ్మితే లైసెన్స్ రద్దు చేసి పారేస్తాం... అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు స్ట్రాంగ్ వార్నింగ్