
దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పాన్‌కేక్- నిరసన..
కేరళలో కొత్త వందేభారత్ రైలు ట్రయల్ రన్‌లో భాగంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ట్రయల్ రన్‌లో భాగంగా మార్గమధ్యలో వందేభారత్ రైలు స్టేషన్‌లలో ఆగినప్పుడు బీజేపీకి చెందిన చాలా మంది కార్యకర్తలు నెయ్యితో చేసిన వేడి వేడి పాన్‌కేక్‌లను పంపిణీ చేయడం కనిపించింది. ఇతర స్వీట్‌లతో పాటు వీటిని అందించడంతో లోకో పైలట్‌లకు పాన్‌కేక్‌ల ‘‘రాజకీయ ఔచిత్యం’’ అర్థం కాలేదు. కానీ అది నిరసన సాధనం అని అక్కడి చూపరులకు ఖచ్చితంగా తెలుసు.
ఎందుకంటే.. కొన్ని వారాల క్రితం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ హై స్పీడ్ కె-రైలు (కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అవశ్యకతను సమర్ధిస్తూ .. కుటుంబ మహిళలు తమ గ్రామాలకు దూరంగా ఉన్న మార్కెట్‌లలో ఇంట్లో తయారుచేసిన పాన్‌కేక్‌లను విక్రయించడానికి, త్వరగా తిరిగి ఇంటికి రావడానికి ఇది సహాయపడుతుందని అన్నారు. ‘‘మహిళలు కూట్టనాడు (త్రిస్సూర్ నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న గ్రామం) నుంచి కూడా అల్పాహారం తీసుకున్న తర్వాత బయలుదేరి.. భోజనానికి ముందు తిరిగి రావచ్చు. కె-రైల్ వారి జీవితాలను ఉత్ప్రేరకపరుస్తుంది’’ అని గోవిందన్ పేర్కొన్నారు.
అయితే గోవిందన్ చెప్పిన మాటలు హాస్యాస్పదంగా కనిపించాయి. ఈ మహిళలు అధిక టికెట్ టారిఫ్‌తో కె-రైలులో ప్రయాణించి త్రిస్సూర్ చేరుకోవడానికి దాదాపు రూ. 100 వెచ్చించాల్సి ఉంటుంది. అధిక టికెట్ ధరను భరిస్తున్న వారికి.. పాన్‌కేక్‌ల ప్యాకెట్‌కు రూ. 50 లభించదు కనుక వారికి మిగిలేది ఏమీ లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే గోవిందన్ ‘‘వ్యూహం’’ చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎగతాళికి గురి అయింది. అయితే కేరళలో వందే భారత్ రైలు ప్రవేశపెట్టిన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు పాన్‌కేక్‌లు కొనడం ద్వారా గోవిందన్‌కు కొన్ని చేదు వాస్తవాలను గుర్తు చేశారు.
యూత్ హంట్..
భారత రాజకీయాల్లో యువనాయకుడు అనే పదం చాలా తరచుగా తప్పుగా పేర్కొనబడింది. ఈ విషయం గురించి శోధించినప్పుడు యువత చాలావరకు ఆఫీస్ బేరర్‌ల జాబితాలోనే కనిపిస్తారు. ఈ సంఖ్య తక్కువగా లేదని అర్థం చేసుకోవాల్సి ఉంది. అన్ని పార్టీలలోని గ్రూప్ రాజకీయాలు, బంధుప్రీతి కారణంగా చాలా మంది నిజమైన యువతకు ఎప్పుడూ చోటు దొరకదు.
అయితే సోమవారం (ఏప్రిల్ 24) కొచ్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్న యువనాయకుల కార్యక్రమం ‘యువం’ వల్ల అకస్మాత్తుగా కేరళ రాష్ట్రంలో యువతకు మంచి డిమాండ్ ఏర్పడింది. బీజేపీ, ఆ పార్టీ యువజన విభాగం ఈ ప్రణాళికను చేపట్టిన వెంటనే.. ఇతర పార్టీలు తమ పేరడీని ప్రదర్శించడానికి ముందుకు వచ్చాయి.
మే నెలలో కొచ్చిలో యువభేరి కార్యక్రమం జరుగుతుందని..ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరై యువతను ఉద్దేశించిప్రసంగిస్తారని కాంగ్రెస్ తొలిసారిగా ప్రకటించింది. అయితే అదే సమయంలో రాహుల్‌ను తమ సమావేశానికి ఆహ్వానించిన యూత్ కాంగ్రెస్ మాత్రం.. తమ ఈవెంట్‌ను యువజన సమావేశంగా మార్చడానికి నిరాకరించింది. తమ సమావేశంలో రాహుల్ ప్రసంగించాల్సి ఉంటుందని.. కొచ్చిలో కేరళ పీసీసీ ప్రతిపాదించిన సమావేశంలో కాదని వారు చెప్పారు. ఇదిలా ఉంటే.. వామపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా తమ వెర్షన్‌ను ప్రారంభిస్తున్నాయి. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆయనను 100 ప్రశ్నలు అడుగుతూ నిరసన తెలపాలని నిర్ణయం తీసుకున్నాయి.
డబుల్ డ్యూటీ..
కర్ణాటకలో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఉపయోగించి గరిష్ట మైలేజీని పొందాలని బాస్ నిర్ణయించుకున్నప్పుడు.. పార్టీ సభ్యులందరూ చక్రం తిప్పడానికి తగినంత సాకారం అందించాల్సి ఉంది. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన బీజేపీ పార్లమెంటు సభ్యులకు కూడా వివిధ నియోజకవర్గాలు, ప్రాంతాలకు సంబంధించిన పార్టీ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు.
టాస్క్ మాస్టర్ బాస్ ఇచ్చిన అదనపు బాధ్యత చుట్టూ ఇప్పుడు ఢిల్లీలో పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటికీ.. ప్రతి ఒక్కరు తమ తమ నియోజకవర్గాలకు కేటాయించిన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అసైన్‌మెంట్ అనేది కాస్మెటిక్ వ్యూహం కాదని, ఓటర్లతో గ్రౌండ్-లెవల్ కనెక్షన్‌లను ఏర్పరచుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నదని వారికి తెలుసు.
కేంద్ర ప్రభుత్వ పథకాలు, గ్రామీణ జనాభాకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించిన కార్యక్రమాలపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా ఓటు బ్యాంకుల మద్దతును వారు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు టాస్క్ మాస్టర్ బాస్ దాదాపు ప్రతిరోజూ వివరణాత్మక నివేదికను ఆశిస్తున్నందున.. నోటితో చెప్పే సమాధానం సరిపోదు. ఈ క్రమంలోనే కొంతమంది ఎంపీలు తమ ఇంటి పాత్రల కంటే కర్ణాటకలో పనిభారం, ఒత్తిడి చాలా ఎక్కువ అని అంటున్నారు. అయితే సరదా సంభాషణల్లో వారిలో కొందరు ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటా లేదా మెంబర్ ఆఫ్ పార్టీనా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు.
నేతాజీ తిరిగి రావడం..
ఆ నేత ఉనికి సాధారణంగా రాజస్థాన్‌లో అధికార పార్టీకి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రముఖ బీజేపీ నాయకుడు చికిత్స నిమిత్తం ఢిల్లీలో ఉండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు నాయకత్వం వహిస్తున్న సమయంలో నేతాజీకి గాయాలు తగిలి ఢిల్లీలో చికిత్స పొందారు. బ్యూరోక్రసీలో ఆయన పలుకుబడిని కొనసాగిస్తున్నందున ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణ టిక్కెట్ బుక్ చేసుకునే ముందు నేతాజీ తన కార్యకర్తలకు మూడు ప్రధాన సమస్యలపై నిరసన తెలియజేయాలని సూచించారు. తన పోరాటాలలో విజయం సాధించడంలో ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహజంగానే ఆందోళన చెందుతోంది. తాజా దూకుడు చర్యలను ఎలా ఎదుర్కోవాలనేది తెలియడం లేదు.
గట్టిగా గురిపెట్టారు..
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు ఇటీవల చేసిన ట్వీట్ పెనుదుమారమే రేపింది. అధికార పార్టీ కుటుంబానికి చెందిన వారి అక్రమ సంపద గురించి తమిళనాడు ఆర్థిక మంత్రి విశృంఖలంగా మాట్లాడుతున్నట్లు ఆరోపించిన వాయిస్ క్లిప్‌ను షేర్ చేయడంతో అది వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిణామం తర్వాత సన్నిహితంగా సంరక్షించబడిన కుటుంబ రహస్యాన్ని ‘‘బయటపెట్టినందున’’ ఆర్థిక మంత్రి పదవి నుంచి తొలగించాలనే తతంగం ఉంది. ముఖ్యమంత్రి సన్నిహిత బంధువులు ఇటీవలి సంవత్సరాలలో సేకరించిన రూ. 30,000 కోట్ల విలువైన సంపదను ఎలా నిర్వహించాలో తెలియడం లేదని ఆరోపించిన వాయిస్ క్లిప్‌లో చెప్పబడింది.
అయితే గతంలో ఖరీదైన చేతి గడియారాన్ని ధరించినందుకు తమ అధ్యక్షుడిని ఇబ్బంది పెట్టినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. ఆ గడియారం తన స్నేహితునిది అని చెప్పి మెలికలు తిరిగినప్పటికీ.. ఆ నిందను పూర్తిగా తుడవలేకపోయారు. ఇక, ఇప్పుడు లీకైన వాయిస్ క్లిప్‌ను బీజేపీ శ్రేణులు అధికార పార్టీపై దాడికి పూర్తిగా ఉపయోగిస్తున్నారు.
అయితే ఆర్థిక మంత్రి ఆ ఆడియో క్లిప్ నకిలీదని ఆరోపించినప్పటికీ.. డీఎంకే నాయకత్వం పూర్తిగా కలత చెందింది. చివరిగా వినికిడి ఏమిటంటే ఆయన నిర్లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలకు ఆర్థిక మంత్రిని త్వరలో మార్చనున్నారనే ప్రచారం కూడా సాగుతుంది.
టీకప్‌లో తుఫాను..
రాజస్థాన్‌లో ఈ మధనం అంత తేలికగా తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే.. రాజస్థాన్‌లో ఒక సీనియర్ మంత్రికి వ్యతిరేకంగా జరిగిన నిరసనను ఇతర కాంగ్రెస్ నాయకులు అతని నియోజకవర్గంపై దృష్టిలో ఉంచుకుని కొరియోగ్రఫీ చేస్తున్నారు. మంత్రి నియోజక వర్గానికి చెందిన ఓ చిన్న టీ షాపు యజమాని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే టీ షాపు యజమాని మంత్రి పేరును, ఓ హోటల్ యజమాని పేరును తన సూసైడ్ నోట్‌లో ఉంచడం తీవ్ర కలకలం రేపింది. మృతుడు తన చివరి మాటలను కూడా వీడియోలో రికార్డ్ చేశారు.
ప్రస్తుతం అరెస్ట్ అయిన హోటల్ యజమాని అతని సంస్థకు సమీపంలోని తన చిన్న భూమిని లాక్కోవడానికి ప్రయత్నించాడని ఆరోపించారు. హోటల్ యాజమాన్యం కఠోర ప్రయత్నాలకు మంత్రి ఆదరణే కారణమని పేర్కొన్నారు. ఆ అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఏమిటంటే.. ఆ పార్టీ శ్రేణులే కొందరు సమస్యను పెద్దది చేయడానికి బాధిత కుటుంబానికి మద్దతు అందించడం.