కారణమిదీ: ఈడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాజీనామా

Published : Mar 12, 2023, 09:47 AM IST
కారణమిదీ: ఈడీ  స్పెషల్  పబ్లిక్ ప్రాసిక్యూటర్  నితీష్ రాజీనామా

సారాంశం

 ఈడీ ప్రత్యేక  పబ్లిక్ ప్రాసిక్యూటర్  నితీష్ రాణా   రాజీనామా  చేశారు.  వ్యక్తిగత  కారణాలతో  రాజీనామా  చేసినట్టుగా  ఆయన  ప్రకటించారు.  

న్యూఢిల్లీ: ఈడీ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా  శనివారం నాడు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టుగా  ఆయన  ప్రకటించారు. అనేక కీలక కేసుల్లో  ఈడీ తరపున  నితీష్ రాణా వాదనలు  విన్పించారు.

మాజీ కేంద్ర మంత్రి పి. చిదరంబరం , కాంగ్రెస్ నేత డికె శివకుమార్,  ఆర్ జేడీ  చీఫ్ లాలాూ ప్రసాద్ యాదవ్,  టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాలకు వ్యతిరేకంగా  దాఖలైన కేసుల్లో  ఈడీ  తరపున   ఆయన వాదనలు విన్పించారు. 

జమ్మూ కాశ్మీర్ లో  ఉగ్రవాదులకు  ఫండింగ్  విషయమై  హఫీజ్  సయీద్ , సయ్యద్  సలావుద్దీన్ లపై  రానా  వాదించారు. ఎయిరిండియా  స్కామ్,  విజయ్ మాల్యా , నీరవ్ మోడీ,  మొహల్  చోక్సీలపై  మనీలాండరింగ్  కేసులు , రాన్ బాక్సీ, రెలిగేర్ మోసం, బయోటెక్  స్కాం,  పశ్చిమ బెంగాల్ పశువుల  అక్రమ రవాణా వంటి  కేసులను ఆయన వాదించారు.ఫోర్బ్స్ జాబితాలో  లీగల్  పవర్  లిస్ట్  ఆఫ్  2020  లో రానా పేరును ప్రకటించారు.యూకేలో  మనీలాండరింగ్  కేసుల విచారణకు  ఈడీ తరపున  ఆయన     పాల్గొన్నారు.

 


 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!