ఫ్రమ్ ది ఇండియా గేట్: యూసీసీపై బీజేపీ నిశ్శబ్దం.. కాంగ్రెస్‌లో క్రౌడ్ పుల్లర్ పోటీ..

Published : Sep 03, 2023, 01:56 PM IST
ఫ్రమ్ ది ఇండియా గేట్: యూసీసీపై బీజేపీ నిశ్శబ్దం.. కాంగ్రెస్‌లో క్రౌడ్ పుల్లర్ పోటీ..

సారాంశం

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..   

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

యూసీసీపై నిశ్శబ్దం..
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)పై బీజేపీ ఎందుకు మౌనంగా ఉంది? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రారంభంలో యూసీసీపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఎంతో విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు యూసీసీపై చేసినంత ఆర్భాటంగా ప్రస్తుతం చర్చించడం లేదు. అయితే యూసీసీపై కేంద్రం నిశ్శబ్దాన్ని.. కర్ణాటక ఎన్నికల పరాజయం, మణిపూర్ హింసకు ఆపాదించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుండగా.. అయితే అసలు కారణం భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంపై తన శక్తినంతా కేంద్రీకరించాలన్న ప్రధాన మంత్రి ఆశయంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం మోదీ ప్రభుత్వం జీ20 సదస్సులో చురుకుగా పాల్గొంటోంది. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం చూస్తుంది. మరోవైపు అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట వచ్చే ఏడాది జనవరిలో జరగనుంది. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల వరకు యూసీసీ బిల్లును సమర్పించడాన్ని ప్రధాని మోదీ ఆలస్యం చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రాథమిక దృష్టి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించడం, ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చడమే.

రాంగ్ పిచ్..
శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య, కేరళ సీపీఎం సైబర్ గ్రూపుల మధ్య సంబంధం ఏమిటి? అని మీరు అనుకోవచ్చు. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఊహించినందుకు మార్కులు లేనప్పటికీ.. ఇటీవల సైబర్ గ్రూపుల నుంచి ద్వేషపూరిత సందేశాలతో క్రికెటర్ సనత్ జయసూర్య ఇన్‌బాక్స్ నిండిపోయింది. అయితే సైబర్ స్పేస్‌ను ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఆ గ్రూప్‌లలో జీరో అవగాహనను బహిర్గతం చేస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. కేరళలో రైతుల అంచనాలను అందుకోవడంలో లెఫ్ట్ ప్రభుత్వం విఫలమైందని మలయాళ నటుడు జయసూర్య తీవ్రంగా విమర్శించారు. వేలాది మంది రైతుల నుంచి సేకరించిన వరికి సరైన ధర చెల్లించడం లేదని ఆయన పాయింట్ అవుట్ చేశారు. 

ఈ ఫలితంగా రైతులు నానా అవస్థలు పడి కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఓనం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలోనే జయసూర్య ఈ విషయం చెప్పారు. అయితే అక్కడే ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి పి ప్రసాద్‌.. దీనిని తప్పుపట్టేందుకు ప్రయత్నించారు. అయితే గణాంకాలు, ఆయన వాదనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ పరిణామాల జరిగిన వెంటనే సైబర్ గ్రూపులు నటుడు జయసూర్యను సంఘీ అని వేటాడడం ప్రారంభించాయి. అయితే ఈ వేట తప్పుడు ప్లేస్‌లో ల్యాండ్ అయింది. ఇది క్రికెటర్ జయసూర్య పేజీని ముంచెత్తింది. ఈ చర్య హాస్యాస్పదంగా మారడంతో.. సీపీఎం వెంటనే వాల్యూమ్‌ను తగ్గించింది.

బనానా రిపబ్లిక్..
అతని తండ్రి రాజస్థాన్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన మంత్రి. కానీ కొడుకు తన తండ్రిని ప్రతిసారీ ఇబ్బంది పెట్టడం ఆపలేదు. ఇటీవల జరిగిన సంఘటన విషయానికి వస్తే.. అతను స్వచ్ఛంద సేవా కార్యక్రమాల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ తన పుట్టినరోజును జరుపుకోవడానికి కోటరీ నుంచి లభించిన మద్దతుతో ఉత్సాహంగా ఉన్నాడు. కానీ మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఒక రోగి అదనపు అరటిపండు కావాలని కోరడంతో అక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అతడు తనతో పాటు కొన్ని అరటిపండ్లు తెచ్చుకున్నాడు.

ఈ క్రమంలోనే మరిన్ని పండ్లు కావాలనే డిమాండ్ మంత్రి కుమారుడికి కోపం తెప్పించింది. అది చివరికి రచ్చతో ముగిసింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే రోగుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని మంత్రి కుమారుడిని వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ‘‘శక్తిమంతుడైన’’ అతడి తండ్రి ఆసుపత్రికి వెళ్లి రోగికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే సంక్షోభం నుంచి అతడు బయటపడగలిగాడు. అయితే ఆ ఆసుపత్రి తన నియోజకవర్గంలోనే ఉండటంతో అతడి తండ్రి ఆందోళనకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. 

క్రౌడ్ పుల్లర్ పోటీ..
పార్టీ బిగ్ బాస్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయడంతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ నేతలు అయోమయంలో పడ్డారు. ఇది వినడానికి సరళంగా అనిపించవచ్చు. అయితే ఒక కన్వెన్షన్‌కు గరిష్ట సంఖ్యలో మద్దతుదారులను తీసుకువచ్చే నాయకుడికి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్ ఇవ్వబడుతుంది. బల నిరూపణ కోసం నిర్దేశించిన ఈ డిమాండ్ కాంగ్రెస్ నేతలను కలవరపరిచింది. అయితే దీనిపై ఎక్కువగా ఆందోళన చెందుతుంది.. సీఎం గెహ్లాట్ కేబినెట్‌లోని మంత్రులే. వారిలో చాలా మంది పబ్లిక్ కనెక్షన్ కోల్పోయారు. దీంతో సహజంగానే.. అలాంటి అభ్యర్థనకు తమ ఓటర్లు ఎలా స్పందిస్తారో వారికి పూర్తిగా తెలియదు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu