ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు.. ఒకేసారి 5శాతం పెంపు...

By SumaBala BukkaFirst Published Mar 30, 2023, 8:37 AM IST
Highlights

టోల్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  శనివారం నుంచి అంటే ఏప్రిల్ ఒకటినుంచి ఈ పెంచిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. 
 

హైదరాబాద్ : జాతీయ రహదారులపై  టోల్ చార్జీలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. దాదాపు ఐదు శాతం టోల్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిఏటా డబ్ల్యూపీఏ, స్థూల జాతీయ ఉత్పత్తి గణాంకాల ఆధారంగా ఏప్రిల్ ఒకటిన టోల్ చార్జీలు పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే ఈసారి టోల్ చార్జీలను భారీగా పెంచింది. 

హైదరాబాదు నుంచి విజయవాడకు నేషనల్ హైవే 65 మీదుగా.. ఎవరైనా సొంత కారులో 24 గంటల వ్యవధిలో వెళ్లి రావడానికి ప్రస్తుతం రూ.465 టోల్ ను వాహనదారులు చెల్లిస్తున్నారు. ఇది, ఏప్రిల్ ఒకటి అంటే శనివారం నుంచి రూ.490కి  చేరుతుంది. ఒక్కసారి ఏకంగా 25 రూపాయల టోల్ ఛార్జీ పెరిగింది. హైదరాబాదు నుండి విజయవాడ మార్గంలో  పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లుల దగ్గర టోల్ ప్లాజాలు ఉన్నాయి. 

Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్.. నో టోల్ గేట్స్.. 6 నెలల్లో జీపీఎస్‌ ఆధారిత వసూలు!

నిత్యం ఇక్కడ వందలాది వాహనాలు టోల్ చెల్లిస్తుంటాయి. ఈ టోల్ ప్లాజాల గుండా ఒకవైపు ప్రయాణించడానికి  ప్రస్తుతం రూ.300 చెల్లిస్తున్నారు. ఇది పెరిగిన చార్జీల లెక్కల ప్రకారం రూ.325  అయ్యింది.  ఇక లైట్ మోటార్ వాణిజ్య సరుకు రవాణా వాహనాలు, మినీ బస్సులు,  భారీ, అతి భారీ వాహనాల మీద ప్రస్తుతం వసూలు చేస్తున్న దానికి మరింత అదనంగా ఐదు శాతం వసూలు చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బెంగళూరు, 

డిండి, విజయవాడ,  యాదాద్రి, వరంగల్, నాగపూర్, భూపాలపట్నం, పుణె తదితర ప్రాంతాలకు వెళ్లడానికి జాతీయ రహదారులు ఉన్నాయి. వీటితోపాటు తెలంగాణ రాష్ట్రం మీదుగా పక్క రాష్ట్రాలకు వెళ్లడానికి 10 నేషనల్ హైవేలు ఉన్నాయి. ఆయా సంబంధిత రహదారుల మీద తెలంగాణ పరిధిలోకి వచ్చే 32 టోల్ ప్లాజాలు ఉన్నాయి.  హైదరాబాద్--విజయవాడ, హైదరాబాద్--బెంగళూరు,  హైదరాబాద్ - వరంగల్ రోడ్లలో.. నిత్యం వాహనాలు  అధిక సంఖ్యలో తిరుగుతుంటాయి. 

click me!