దంపతులకు పెళ్లి కానుక.. పెట్రోల్ క్యాన్

Published : Sep 17, 2018, 10:16 AM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
దంపతులకు పెళ్లి కానుక.. పెట్రోల్ క్యాన్

సారాంశం

 ఓ వరుడికి పెళ్లి పందిట్లోనే అతని స్నేహితులు ఐదులీటర్ల పెట్రోలుతో కూడిన క్యాన్ ను బహుమతిగా ఇచ్చిన వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో వెలుగుచూసింది.

పెళ్లిలో నూతన దంపతులకు బహుమతులు అందజేయడం సహజం. డబ్బులు, బంగారం, ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు లాంటివి గిఫ్ట్ గా అందజేస్తుంటారు. కానీ.. పెట్రోల్ గిఫ్ట్ గా ఇవ్వడం ఎప్పుడైనా విన్నారా.. ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రంలో.

పెట్రోలు ధరలు ఆకాశన్నంటిన నేపథ్యంలో ఓ వరుడికి పెళ్లి పందిట్లోనే అతని స్నేహితులు ఐదులీటర్ల పెట్రోలుతో కూడిన క్యాన్ ను బహుమతిగా ఇచ్చిన వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కడలూరులో వెలుగుచూసింది. కడలూరు పట్టణ సమీపంలోని కుమారచ్చి గ్రామానికి చెందిన ఎలన్ చెజియన్, కనిమొళి అనే యువతిని పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకకు వచ్చిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన ప్రభు అనే ఓ విద్యార్థి వరుడికి ఐదులీటర్ల పెట్రోలుతో కూడిన క్యాన్ ను బహుమతిగా అందించారు. 

దేశంలో పెట్రోలు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో దీని విలువ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకే తాను వరుడికి పెట్రోలున్న క్యాన్ ను బహుమతిగా ఇచ్చానని ప్రభు చెప్పారు. పెళ్లికుమారుడికి బహుమతిగా ఇచ్చిన కొత్త బైక్ లో బహుమతిగా ఇచ్చిన పెట్రోలు పోశారు. ఇలా పెళ్లి పందిరిలోనే పెట్రోలు బహుమతి ఇవ్వడం అందరినీ ఆశ్యర్య పరిచింది. పెట్రోలు ధరలు ఆకాశన్నంటుతున్న నేపథ్యంలో తాము ఇచ్చిన పెట్రోలు బహుమతి చూసిన దంపతులు సంతోషం వ్యక్తం చేశారని దీపా అనే మహిళ చెప్పారు.

PREV
click me!

Recommended Stories

African Queen Ant Smuggling: చీమల స్మగ్లింగ్ వీటితో కోట్లు సంపాదన | Asianet News Telugu
CBSE కొత్త రూల్.. పిల్లలపై భారం తప్పదా? 3 భాషలు చదవాల్సిందేనా? | Asianet News Telugu