Manipur horror: స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం.. ఆలస్యంగా వెలుగులోకి

Published : Jul 23, 2023, 01:31 PM IST
Manipur horror: స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవ దహనం.. ఆలస్యంగా వెలుగులోకి

సారాంశం

మణిపూర్‌లో మరో దుర్ఘటన వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఓ సాయుధ మూక ఇంటికి తాళం వేసి నిప్పంటించి సజీవ దహనం చేసింది. ఈ ఘటన మే 28వ తేదీన కాక్చింగ్ జిల్లాలో చోటుచేసుకుంది.  

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మరో దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను సజీవంగా దహనం చేశారు. మే 28వ తేదీన చోటుచేసుకున్న తాజాగా కలకలం రేపింది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం నుంచి సత్కారం అందుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్ చురాచాంద్ సింగ్ భార్యసోరో కైబామ్ ఇబెటోంబిని దారుణంగా ఇంటికి తాళం వేసి.. నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఈ ఘటన కాక్చింగ్ జిల్లా సెరో గ్రామంలో జరిగింది. 

మే 3వ తేదీ నుంచి ఈశాన్య రాష్ట్రం మణిపూర రెండు తెగలు మైతేయి, కుకీ తెగల మధ్య హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి. అదే నెల 28వ తేదీన సెరో గ్రామంలో సాయుధ మూక సమరయోధుడి భార్యను సజీవ దహనం చేసింది. ఆ గ్రామంలో హింస చెలరేగింది. కాల్పులు కూడా జరిగినట్టు సమాచారం.

Also Read: హారన్ కొట్టాడని ఆటో డ్రైవర్‌ను కొట్టిచంపేశారు.. ‘కేక్ కట్ చేసే దాకా ఆగలేవా?’

సెరో గ్రామంలో ఇబెటోంబి ఇంటిలోపల ఉండగానే.. ఆ సాయుధ మూక బయటి నుంచి ఇంటి గడి పెట్టారు. అనంతరం, ఆ ఇంటికి నిప్పు పెట్టారు. ఆ ఇల్లు కాలి బూడిదై కూలిపోయింది. అయితే.. అదే సమయంలో అక్కడ ఇబెటోంబి మనవడు ప్రేమ్ కాంత కూడా ఉన్నాడు. ఆ సాయుధ మూక ఇంటిని చుట్టుముట్టిన తర్వాత కాల్పులు కూడా జరిపారని, తన కాలు, చేయిలోకి కొన్ని తూటాలు దూసుకెళ్లినట్టు ప్రేమ్ కాంత వివరించాడు. అయితే.. తమను బయటికి పంపించి ఇబెటోంబి ప్రాణ త్యాగం చేసిందని చెప్పాడు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !