అదే మన ఉమ్మడి లక్ష్యం.. క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ..

Published : May 24, 2022, 10:56 AM IST
అదే మన ఉమ్మడి లక్ష్యం..  క్వాడ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ..

సారాంశం

క్వాడ్ ప్రయత్నాలు స్వేచ్ఛా, బహిరంగ సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

ఢిల్లీ : Tokyoలో కీలకమైన quad summitను ప్రారంభించిన ప్రధాని Narendra Modi, క్వాడ్ ప్రయత్నాలు స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. పరస్పర విశ్వాసం, దృఢ సంకల్పం ప్రజాస్వామ్య సూత్రాలకు కొత్త ఆశలు కల్పిస్తున్నాయని, క్వాడ్ ప్రపంచ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అన్నారు.

"క్వాడ్ స్థాయిలో, మా పరస్పర సహకారంతో, ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూసివ్ ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రోత్సహించబడుతోంది - ఇదే మనందరి ఉమ్మడి లక్ష్యం:" అన్నారు. 

"ఇంత తక్కువ సమయంలో ప్రపంచం ముందు క్వాడ్ తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. నేడు, క్వాడ్  పరిధి విస్తృతమైంది, దాని రూపం ప్రభావవంతంగా మారింది. మన పరస్పర విశ్వాసం, మన సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్నాయి," అని ప్రధాన మంత్రి మోదీ జోడించారు.

కోవిడ్-19 ప్రతికూల పరిస్థితులను సృష్టించినప్పటికీ, వ్యాక్సిన్ డెలివరీ, వాతావరణ చర్య, సప్లై చెయిన్ ముందూ, వెనకలవ్వడం... విపత్తు ప్రతిస్పందన, ఆర్థిక సహకారం, ఇతర రంగాలలో సమన్వయం పెంచబడింది. ఇది ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది అన్నారు.

అనంతరం కొత్తగా ఎన్నికైన ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌ను అభినందిస్తూ, "నేను అల్బనీస్‌ను అభినందిస్తున్నాను. 24 గంటల్లో ఇక్కడ ఉండటం క్వాడ్ పట్ల మీ నిబద్ధతను చూపుతుంది" అని అన్నారు. క్వాడ్ లేదా చతుర్భుజ భద్రతా సంభాషణలో భారతదేశం, US, జపాన్ , ఆస్ట్రేలియా ఉన్నాయి.

తన జపాన్ కౌంటర్ ఫ్యూమియో కిషిడా ఆహ్వానం మేరకు టోక్యోను సందర్శించిన ప్రధాని మోదీ, శిఖరాగ్ర సదస్సు సందర్భంగా బిడెన్, కిషిదా, అల్బనీస్‌లతో వేర్వేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 2022లో జరిగిన 14వ భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశానికి కిషిదాకు ఆతిథ్యం ఇచ్చాడు.

"టోక్యోలో నా పర్యటన సందర్భంగా, భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో మా సంభాషణను ఆ దిశగా మరింత కొనసాగించాలని ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ తన పర్యటనకు ముందు చెప్పారు. భారత్ జపాన్ మధ్య ఆర్థిక సహకారం వారి ప్రత్యేక వ్యూహాత్మక,ప్రపంచ భాగస్వామ్యంలో ముఖ్యమైన అంశం అని ఆయన అన్నారు.

కొత్తగా ఎన్నికైన ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశం కోసం తాను ఎదురు చూస్తున్నానని, ఈ సందర్భంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద ఇరుదేశాల మధ్య బహుముఖ సహకారం, పరస్పర ఆసక్తితో కూడిన ప్రాంతీయ, ప్రపంచ అంశాలు చర్చకు రానున్నాయని మోదీ తెలిపారు.

ఇదిలా ఉండగా, సోమవారం క్వాడ్ సదస్సు ముందర అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాకు వార్నింగ్ ఇచ్చాడు. చైనా నిప్పుతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించాడు. తైవాన్‌కు ఒక వేళ చైనా ఆక్రమించాలని చూస్తే.. తైవాన్‌కు అండగా తాము ఉంటామని స్పష్టం చేశాడు. తాము చైనా వన్ పాలసీపై సంతకం పెట్టామని, కానీ, ఒక వేళ చైనా బలవంతంగా అంటే మిలిటరీ ప్రయోగించి తైవాన్‌ను దురాక్రమించుకోవాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరుకోబోమని వివరించాడు. బలప్రయోగం ద్వారా తైవాన్‌ను ఆక్రమించుకోజూస్తే ఆ భౌగోళిక ప్రాంతంలో అస్థిరత ఏర్పడుతుందని అనుమానం వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu