Coronavirus : ఎల్లుండి నుంచి ఉచితంగా కరోనా బూస్టర్ డోస్.. కేంద్రం కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jul 13, 2022, 4:04 PM IST
Highlights

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు. 

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు. ఇకపోతే... దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. దేశంలో సోమవారం 10,64,038 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 1,99,00,59,536కు చేరింది.

కాగా.. భారతదేశంలో COVID-19 కేసుల సంఖ్య 2020 ఆగస్టు 7న 20 లక్షలు, ఆగస్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు, సెప్టెంబర్ 16న 50 లక్షల మార్క్‌ను దాటింది. ఇక, 2020 సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షలు, డిసెంబర్ 19న కోటి మార్క్‌ను అధిగమించింది. దేశం గత ఏడాది మే 4న రెండు కోట్లు, జూన్ 23న మూడు కోట్లు,  ఈ ఏడాది జనవరి 25న నాలుగు కోట్ల మార్కును దాటింది. 

click me!