
న్యూఢిల్లీ: తైవాన్ కు చెందిన సెమీ కండక్టర్ల కంపెనీ ఫాక్స్ కాన్ ఇండియాకు చెందిన వేదాంత కంపెనీతో కలిసి సెమీ కండక్టర్ల ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంతకం చేశాయి. అయితే వేదాంత కంపెనీతో కలిసి సెమీ కండక్టర్ల తయారీ నుండి వైదొలుగుతున్నట్టుగా ఫాక్స్ కాన్ సంస్థ మంగళవారంనాడు ప్రకటించింది. ఈ విషయమై కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
ఫాక్స్ కాన్, వేదాంత సంస్థలు సంయుక్తంగా ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో జరిగిన ప్రచారాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు. లక్ష ఉద్యోగాలు సృష్టిస్తామని గుజరాత్ సీఎం పేర్కొన్నారన్నారు.
ఈ విషయమై బీజేపీ నేత అమిత్ మాలవియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. జైరామ్ రమేష్ విమర్శలకు కౌంటరిచ్చారు.సెమీ కండక్టర్స్ తయారీ చాలా క్లిష్టమైన , సాంకేతికతో కూడిన రంగంగా ఆయన పేర్కొన్నారు. ఈ పరిశ్రమకు స్థిరమైన పెట్టుబడులు అవసరంగా ఆయన పేర్కొన్నారు. సెమీ కండక్టర్ రంగంలో యూఎస్, ఈయూ, జపాన్, కొరియా, చైనా వంటి దేశాల పెట్టుబడులు ఆకర్షించేందుకు గణనీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు