సెప్టిక్ ట్యాంక్ లో దిగి నలుగురు కార్మికులు మరణించారు. మొదట ఇద్దరు కార్మికులు లోపలికి వెళ్లి పని చేస్తుండగా వారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లిన మిగితా ఇద్దరు కూడా ఊపిరాడక చనిపోయారు.
సెప్టిక్ ట్యాంక్ లో దిగి నలుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రం సూరత్ లోని పల్సానా ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్ కు చెందిన నలుగురు కార్మికులు పల్సానా-కటోదర రోడ్డులోని ఓ ఫ్యాక్టరీలో ఉన్న సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు మంగళవారం సాయత్రం సమయంలో పూనుకున్నారు.
telangana Assembly polls 2023 : స్కూళ్లకు ఎన్నికల సెలవులు.. ఎప్పటి నుంచి ? ఎన్ని రోజులంటే ?
అయితే ముందుగా దానిని శుభ్రం చేసేందుకు ఇద్దరు కార్మికులు లోపలికి దిగారు. అందులో నుంచి విషవాయువులు వెలువడటంతో వారు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. లోపలికి వెళ్లిన వారి నుంచి ఎలాంటి చప్పుడూ వినపడకపోవడంతో బయట ఉన్న ఇద్దరు కార్మికులకు పరిస్థితి అర్థం అయ్యింది. దీంతో వారిని కాపాడేందుకు ఈ ఇద్దరు కార్మికులు కూడా లోపలికి దిగారు.
బీసీలకు విద్య, వైద్యం, ఉపాధి అందకుండా చేయడమే జగన్ ప్లాన్ - టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
ఈ క్రమంలో వారు కూడా స్పృహతప్పి పడిపోయారు. ఈ నలుగురిని ట్యాంక్ నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పన్సాలా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
ఇలాంటి ఘటనే ఈ ఏడాది మేలో మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పర్భానీ జిల్లాలో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తుండగా విషపూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మరణించారు. ఈ ఘటన ముంబైకి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.