ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు స్పాట్ డెడ్

Published : Sep 11, 2021, 12:27 PM IST
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు స్పాట్ డెడ్

సారాంశం

రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీకొట్టుకోవడంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జోద్‌పూర్ ఆస్పత్రికి తరలించారు.  

జైపూర్: రాజస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. రాజస్తాన్‌లోని బార్మేర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బార్మేర్ గ్రామం గుండా వెళ్తున్న జాతీయ రహదారిపై ఓ పెట్రోల్ పంప్‌కు సమీపంలో జరిగింది.

ఆ మహిళలు జోద్‌పూర్‌లోని లోహావత్ నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 18 మంది కలిసి ఓ క్యాంపర్‌లో స్వగ్రామానికి శుక్రవారం రాత్రి బయల్దేరారు. కానీ, బర్మేర్ గ్రామానికి చేరగానే ప్రమాదం జరిగింది. ఆ క్యాంపర్‌, బస్సు ఢీకొట్టుకోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఇందులో నలుగురు మహిళలు స్పాట్‌లోనే మరణించారని, మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో జోద్‌పూర్ హాస్పిటల్‌కు తరలించినట్టు ఎస్పీ ఆనంద్ శర్మ వివరించారు. ఇంకా తొమ్మిది మంది గాయపడ్డారు. కానీ, వీరంతా ఇప్పుడు సురక్షితంగా ఉన్నట్టు తెలిపారు. తాము త్వరలోనే ఘటనాస్థలికి చేరబోతున్నట్టు వివరించారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు