పుల్వామా దాడి: వాట్సాప్ స్టేటస్.. కశ్మీర్ యువతుల అరెస్ట్

By Siva KodatiFirst Published Feb 17, 2019, 5:38 PM IST
Highlights

జవాన్లపై దాడిని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన నలుగురు కశ్మీర్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్‌కు చెందిన తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

పుల్వామా ఉగ్రదాడిలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించడంపై దేశప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అమరవీరులకు కన్నీటి వీడ్కోలు పలుకుతూనే, వారి కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు.

ఈ క్రమంలో జవాన్లపై దాడిని స్వాగతిస్తూ సంబరాలు జరుపుకోవాలంటూ పిలుపునిచ్చిన నలుగురు కశ్మీర్ యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాశ్మీర్‌కు చెందిన తల్వీన్ మంజూర్, ఇక్రా, జోహ్రా నజీర్, ఉజ్మా నజీర్‌లు జైపూర్‌లోని నిమ్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడికి వారు సంతోషం వ్యక్తం చేస్తూ.. పుల్వామా దాడి తమ ప్రతీకారానికి ధీటైన సమాధానం అంటూ విద్యార్థినుల్లో ఒకరైన తల్వీన్ తన వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్ చేశారు.

ఈ ఘటనపై వర్సిటీలో నిరసనలు వ్యక్తమయ్యాయి. విషయం తెలుసుకున్న యూనివర్సిటీ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. నిమ్స్ యూనివర్సిటీ ఈ తరహా కార్యకలాపాలను సహించదని, వీరిని కాలేజ్‌తో పాటు హాస్టల్‌ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడిచింది. అనంతరం దేశ వ్యతిరేక సందేశాన్ని పోస్ట్ చేసినందుకు గాను పోలీసులకు అప్పగించింది. 
 

click me!
Last Updated Feb 17, 2019, 5:38 PM IST
click me!