షార్ట్ సర్క్యూట్‌తో మొబైల్ పేలుడు: యూపీలో నలుగురు మృతి

By narsimha lode  |  First Published Mar 24, 2024, 1:57 PM IST

మొబైల్ చార్జింగ్ పెడుతున్న సమయంలో  ప్రమాదవశాత్తు పేలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.


న్యూఢిల్లీ:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పల్లవపురం ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో  నలుగురు పిల్లలు మరణించారు.  శనివారం నాడు అర్ధరాత్రి పల్లవపురంలోని జనతా కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.  మొబైల్ కు చార్జింగ్ పెడుతున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు.  సారిక, నిహరిక, గోలు అలియాస్, సంస్కార్, కాలు మృతి చెందారు. వీరి పేరేంట్స్ జానీ, బబితలు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదం జరిగిన వెంటనే బాధితులు కేకలు వేశారు. స్థానికులు వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  నలుగురు చిన్నారులు మృతి చెందారు. చిన్నారుల తండ్రి జానీ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. అయితే  జానీ భార్య బబిత  పరిస్థితి విషమంగా ఉంది. మొబైల్ కు చార్జింగ్ పెడుతున్న సమయంలో మంటలు చెలరేగాయని జానీ పోలీసులకు తెలిపాడు.బబితకు మెరుగైన చికిత్స అందించేందుకు గాను  ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.మొబైల్స్ చార్జింగ్ పెట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన మరోసారి సూచించింది.  మరో వైపు మొబైల్స్  చార్జింగ్ పెట్టి ఫోన్లు మాట్లాడడం సరైంది కాదని  నిపుణులు సూచిస్తున్నారు .

Latest Videos

 

click me!