నీటి ఎద్దడిపై చర్యలు తీసుకోవాలి: జైలు నుండి కేజ్రీవాల్ ఆదేశం

By narsimha lodeFirst Published Mar 24, 2024, 1:23 PM IST
Highlights

నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో  చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  అధికారులను ఆదేశించారు.

న్యూఢిల్లీ: నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  అధికారులను ఆదేశించారు.  ఈడీ కస్టడీ నుండే  అరవింద్ కేజ్రీవాల్  శనివారం నాడు రాత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను  గత వారంలో  ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.  ఈడీ అధికారుల కస్టడీలో  కేజ్రీవాల్ ఉన్నారు. ఈడీ అధికారుల కస్టడీ నుండే కేజ్రీవాల్ ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా ఆప్ వర్గాలు తెలిపాయి.

శనివారం నాడు సాయంత్రం ఢిల్లీ వాటర్ మినిస్టర్  అతిషికి  నోట్ ను పంపారు కేజ్రీవాల్.జైలు నుండి కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేసినా ఎలాంటి మార్పు  ఉండదని ఆప్ పేర్కొంది.ఢిల్లీ లిక్కర్ కేసులో  అరవింద్ కేజ్రీవాల్ ను ఈ నెల  21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మరునాడే  రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. అయితే కేజ్రీవాల్ ను ఈ నెల  28వ తేదీ వరకు  ఈడీ కస్టడీకి  కోర్టు ఇస్తూ ఆదేశించింది. 

ఢిల్లీలో  నీటి కొరత లేకుండా చూడాలని  సీఎం అరవింద్ కేజ్రీవాల్  ఆదేశాలు జారీ చేశారని  వాటర్ మినిస్టర్ అతిషి  చెప్పారు. ఆదివారం నాడు ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.అవసరమైతే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సహాయం తీసుకోవాలని కూడ  సీఎం సూచించినట్టుగా  అతిషి తెలిపారు.ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నీటి, డ్రైనేజీ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్నట్టుగా  కేజ్రీవాల్ చెప్పారన్నారు.ఈ విషయమై తాను ఆందోళన చెందుతున్నారని మంత్రి చెప్పారు. తాను జైలులో ఉన్నందున ప్రజలకు సమస్యలు రాకూడదని సీఎం భావిస్తున్నారని అతిషి తెలిపారు.  నీటికొరత ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సీఎం సూచించారన్నారు. ఈ మేరకు అధికారులకు  ఆదేశాలు జారీ చేయాలని కేజ్రీవాల్ కోరారన్నారు.

ప్రతి ఒక్కరూ సమాజం కోసం పనిచేయాలని కేజ్రీవాల్ తమకు సూచించారని,  బీజేపీ వారిని కూడ ద్వేషించవద్దని  కూడ సూచించినట్టుగా  కేజ్రీవాల్ భార్య సునీత చెప్పారు. కేజ్రీవాల్ రాసిన లేఖను ఆమె చదివి వినిపించారు. ఎక్కువ కాలం తాను జైలులో ఉంచలేరన్నారు. త్వరలోనే జైలు నుండి విడుదలై  ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.
 

click me!