గడ్చిరోలిలో మావోయిస్టుల అరెస్ట్: నలుగురిపై రూ. 18 లక్షల రివార్డు

Published : Apr 22, 2022, 10:14 AM IST
 గడ్చిరోలిలో మావోయిస్టుల అరెస్ట్: నలుగురిపై రూ. 18 లక్షల రివార్డు

సారాంశం

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నలుగురు మావోయిస్టులను అరెస్ట్ చేసినట్టుగా ఎస్పీ అంకిత్ గోయల్ చెప్పారు. ఈ నలుగురిపై రూ. 18 లక్షల రివార్డు ఉందని పోలీసులు ప్రకటించారు.

ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో  నలుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. గడ్చిరోలి జిల్లాలోని నెలగొండలో నలుగురు మావోయిస్టులు సంచరిస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురిపై రూ. 18 లక్షల రివార్డు ఉందని పోలీసులు వివరించారు.

నెలగొండకు చెందిన బాపు అలియాస్ రామాజీ దోగె వడ్డె, కనెలికి చెందిన మరోటి అలియాస్ అంతురామ్, అలియాస్, మాణిక్ సాధు గావాడే, పడాన్‌పల్లికి చెందిన సుమన్ అలియాస్ జన్ని కోమటి కుడ్యామి, భరత్ మైసు హిచామీ అజిత్‌లను పోలీసులు పట్టుకున్నారు.

ఇంటలిజెన్స్ సమాచారం మేరకు నెలగొండ అటవీ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ బృందం కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ నలుగురు అటవీ ప్రాంతంలో ఉండగా అరెస్ట్  చేసినట్టుగా Gadchiroli SP అంకిత్ గోయల్ చెప్పారు. గురువారం నాడు రాత్రి వీరిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు.

బాపు వడ్డే కంపెనీ 10లో ఏరియా కమిటీ మెంబర్ గా వ్యవహరిస్తున్నారు.2020 ఆగష్టు 14న కోఠి గ్రామంలో పోలీస్ అధికారి దుష్యంత్ పండి నందీశ్వర్ ను హత్య చేశాడు. ఇతడిపై 13 కేసులున్నాయని పోలీసులు చెప్పారు. ఏడు హత్యలు, మూడు ఎన్ కౌంటర్లు,రెండు దోపీడీ కేసులున్నాయని Ankit Goyal,వివరించారు.

మరోతి గవాడే గట్టా లాస్‌తో ఏసీఎంగా కూడా వ్యవహరిస్తున్నారని పోలీసులు చెప్పారు. Maoistల యాక్షన్ టీమ్ లో ఆయన సభ్యుడిగా ఉన్నారని చెప్పారు. ఇతడుమూడు ప్రధాన నేరాల్లో పాల్గొన్నట్టుగా ఎస్పీ వివరించారు.

సుమన్ కుడ్యామి, పెర్మిలిలు ఎల్ఓఎస్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మూడు హత్యలు, ఎనిమిది ఎన్ కౌంటర్లలో పాల్గొన్నట్టుగా ఎస్పీ చెప్పారు. గవాడే, హిచామీ ఇద్దరూ కూడా ఇధ్దరు పౌరులను చంపిన కేసుల్లో కూడా నిందితులని పోలీసులు ప్రకటించారు.

ఇతర నేరాల్లో కూడా ఈ నలుగురి ప్రమేయం ఉందా అనే విషయమై కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.  గడ్చిరోలి జిల్లాలో నక్సలిజానా్ని అరికట్టేందుకు యాంటీ నక్సల్స్ కార్యకలాపాలను ముమ్మరం చేస్తామని పోలీసులు తెలిపారు. హింసాత్మక మార్గాన్ని వదిలేసి శాంతిమార్గంలో నడవాలని పోలీసులు మావోయిస్టులను కోరారు. 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్