కుటుంబం మొత్తం బలవన్మరణం.. ఆకలితో చిన్నారి..!

Published : Sep 18, 2021, 08:36 AM IST
కుటుంబం మొత్తం బలవన్మరణం.. ఆకలితో చిన్నారి..!

సారాంశం

 రెండో కాన్పునకు వచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించాక అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించన్ ను తండ్రి శంకర్ కోరుతున్నాడు. ఈ విషయంలో కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.


కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడ్డారు. తమ ఇంట్లోని ఇద్దరు చిన్నారులను అలా వదిలేసి.. మిగిలిన సభ్యులంతా ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో పెద్దవారు లేకపోవడంతో.. ఆకలికి తట్టుకోలేక ఓ చిన్నారి కన్నుమూయడం గమనార్హం. ఈ దారుణ సంఘటన బెంగళూరులోని తిగళరవాళ్య చేతన్ కూడలి లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిగళరపాళ్య చేతన్ కూడలిలో నివాసముండే శంకర్ అనే వ్యక్తి కుటుంబసభ్యులంతా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్లాలని ఆయన తన కుమార్తెకు చెప్పడం వల్లే.. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. శంకర్ భార్య భారతి(50), ఆమె కుమార్తెలు సించన(33), సింధూ రాణి(30), కుమారుడు మధుసాగర(27) ఆత్మహత్య చేసుకున్నారు.

సించన తొమ్మది నెలల కుమారుడు ఆకలి తాళలేక మరణించాడు. ఆమె కుమార్తె ప్రేక్ష(3) స్పృహ కోల్పోయింది. బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండో కాన్పునకు వచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించాక అత్తింటికి వెళ్లాలని కొద్ది రోజులుగా సించన్ ను తండ్రి శంకర్ కోరుతున్నాడు. ఈ విషయంలో కుటుంబీకుల మధ్య గొడవలు జరిగాయని పోలీసులు భావిస్తున్నారు.

తన మాట ఎవరూ వినడం లేదని శంకర్ ఆదివారం ఇంటి నుంచి వెళ్లి బంధువుల ఇళ్లలో కాలం గడిపారు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి అనుమానంతో కిటికీ నుంచి చూసి ఆయన నిశ్చేష్టులయ్యారు. కుటుంబీకులు 5 రోజుల కిందటే ఉరేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

భార‌త్‌లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు పెడుతోన్న అమెజాన్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌.. భ‌విష్య‌త్తులో ఏం జ‌ర‌గ‌నుందంటే?
Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?