కామ పిశాచి: మహిళను చంపి శవంపై టీనేజర్ అత్యాచారం

Published : Sep 18, 2021, 07:57 AM IST
కామ పిశాచి: మహిళను చంపి శవంపై టీనేజర్ అత్యాచారం

సారాంశం

రాజస్థాన్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన బామ్మ బయస్సు గల మహిళను హత్య చేసి, ఆమె శవంపై లైంగిక దాడి చేశాడు. స్థానికంగా ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత జుగుప్సాకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు వృద్ధ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీన్ని అతను సహించలేక ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శవంపై లైంగిక దాడి చేశాడు. 

హనుమాన్ ఘర్ ప్రాంతంలో నివసిస్తున్న 60 ఏళ్ల వయస్సు గల మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆమెకు పిల్లలలు లేరు. రాజస్థాన్ లోని పిలిబంగ పట్టణానికి చెందిన సురేంద్ర కుమార్ అనే యువకుడు ఆమెపై కన్నేశాడు. ఈ నెల 15వ తేదీ అర్థరాత్రి అతను ఆమె ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. 

ఆమె యువకుడిని తీవ్రంగా ప్రతిఘటించింది. దాంతో సురేంద్ర కుమార్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆమె చనిపోయింది. ఆ తర్వాత అతను ఆమె శవంపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 

మహిళ బావ ఇంటికి వచ్చి చూసే సరికి ఆమె శవం కనిపించింది. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీస,ులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సురేంద్ర ఆమె ఇంట్లోకి వెళ్లడం చూసిన కొందరు విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు సురేంద్ర కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతను పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించాడు.

PREV
click me!

Recommended Stories

భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport
కేరళను ముంచెత్తిన వరదలు రోడ్లపై పడవలు | Kerala Floods 2026 Boats on Roads After Heavy Rains