యజమాని కోసం కుక్కల ప్రాణత్యాగం

Published : Apr 19, 2019, 01:09 PM IST
యజమాని కోసం కుక్కల ప్రాణత్యాగం

సారాంశం

యజమాని కుటుంబాన్ని కాపాడే క్రమంలో నాలుగు కుక్కలు ప్రాణత్యాగం చేశాయి. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం బాగల్ పూర్ లో చోటుచేసుకుంది.

యజమాని కుటుంబాన్ని కాపాడే క్రమంలో నాలుగు కుక్కలు ప్రాణత్యాగం చేశాయి. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం బాగల్ పూర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... బాగల్ పూర్ కి చెందిన పూనమ్ అనే వైద్యురాలు మూడు సంవత్సరాలుగా నాలుగు కుక్కలను పెంచుకుంటోంది. వాటిని తన ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగానే వారు భావించేశారు.

ఆ నాలుగు కుక్కల్లో ఒకటి తల్లి.. మిగితా మూడు దాని పిల్లలు. ప్రతిరోజూ రాత్రి ఇంటి బయటకు కాపలాకాయడం ఈ నాలుగు కుక్కలకు అలవాటు. ఈ క్రమంలోనే  రెండు రోజుల క్రితం అవి ఇంటికి కాపలాగా ఉన్న సమయంలో... ఇంట్లోకి ఓ పాము ప్రవేశించాలని చూసింది. దానిని అడ్డుకోవడానికి ఈ నాలుగు కుక్కలు ప్రయత్నించాయి.

ఈ క్రమంలోనే పాము కాటుకి గురయ్యి.. ప్రాణాలు విడిచాయి. కాగా... ఈ ఘటనంతా సమీపంలోని సీసీ టీవీ కెమేరాలో రికార్డు అయ్యింది. దీంతో వీడియో వైరల్ గా మారింది. తాము ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలు ప్రాణాలు విడవడంతో డాక్టర్ కుటుంబసభ్యులు విలపించారు.

PREV
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !