బీహార్‌లోని గయలో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్.. !

By SumaBala BukkaFirst Published Dec 26, 2022, 2:14 PM IST
Highlights

బీహార్ లోని గయకు వచ్చిన నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వీరిని ఐసోలేషన్ లో ఉంచారు. బోధ్ గయాలో బోధ మహోత్సవ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది విదేశీయులు గయకు రానున్నారు. 

పాట్నా : బీహార్‌లో నలుగురు విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. గయా విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్‌టిపిసిఆర్ పరీక్షల్లో వీరికి పాజిటివ్ నిర్థారించబడింది. దీంతో ఈ నలుగురిని ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచారు. మయన్మార్ నుండి ఒకరు, థాయిలాండ్ నుండి ఒకరు, ఇంగ్లండ్ నుండి వచ్చి ఇద్దరు మొత్తం నలుగురు విదేశీయులు బోధ్ గయాకు వచ్చారు. బోధ్ గయాలో బోధ్ మహోత్సవ్‌ జరుగుతోంది. 

బౌద్ధ గురువు దలైలామా బోధ్ గయాలో నెలరోజులు ఉంటున్నారు. దీంతో దలైలామాను చూసేందుకు.. ఆయనను కలిసేందుకు విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారు. బోధ్ గయా బౌద్ధ తీర్థయాత్రికులకు ఓ పవిత్ర స్థలం. దీనిమీద గయా జిల్లా ఇన్‌ఛార్జ్ వైద్య అధికారి డాక్టర్ రంజన్ సింగ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా కేసులు అంత తీవ్రంగా లేవు. అయినా కూడా, వ్యాధి వ్యాప్తి చెందకుండా అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. బోద్ మహోత్సవ్ కోసం ఏర్పాటు చేసిన డ్రిల్‌లో భాగంగా గయ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లాంటి అనేక ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

హిందువులు ఇళ్లల్లో పదునైన ఆయుధాలు ఉంచుకోవాలి.. కనీసం కత్తులనైనా దాచండి - బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్

ఆదివారం విమానాశ్రయంలో  జలుబు, దగ్గుతో బాధపడుతున్న విదేశాలనుంచి వచ్చిన  33 మంది విదేశీయులను పరీక్షించగా, వారిలో నలుగురు పాజిటివ్‌గా తేలారని డాక్టర్ సింగ్ తెలిపారు. ఈ నలుగురిలో ముగ్గురు గయలో ఐసోలేషన్ లో ఉన్నారు. మరో వ్యక్తి ఢిల్లీ వెళ్లిపోయాడని తెలుస్తోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో  ఈ ఘటనతో వైద్య వర్గాలు అప్రమత్తమయ్యాయి. 

ఇక అంతకు ముందు శుక్రవారం చైనా నుండి వచ్చిన 40 ఏళ్ల వ్యక్తికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, భారతదేశంలో సోమవారం 196 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసులు స్వల్పంగా 3,428 కి పెరిగాయి.కోవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లు (4,46,77,302) నమోదవగా, ఇద్దరి మృతితో.. మరణాల సంఖ్య 5,30,695కి చేరుకుంది.

click me!