పట్టాలపై కూర్చొని మందు పార్టీ.. రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి

By telugu teamFirst Published Nov 15, 2019, 11:49 AM IST
Highlights

పరీక్ష రాసిన అనంతరం ఈ నలుగురు మిత్రులు వైన్ షాప్ కి వెళ్లారు. అక్కడ మందు తాగారు. బార్ మూసివేసిన తర్వాత ఇంకా కొంచెం మద్యం తీసుకొని సమీపంలోని ఓ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. అక్కడే రైల్వే ట్రాక్ పై కూర్చొని మద్యం సేవించారు. 

పట్టాలపై కూర్చొని నలుగురు విద్యార్థులు మందు పార్టీ చేసుకుందామని అనుకున్నారు. కానీ.. ఆ మందు పార్టీనే వారి జీవితంలో చివరి రోజు అవుతుందని ఊహించలేదు. వారు పట్టాలపై ఉండగానే వేగంగా వచ్చిన ఓ రైలు వారిని ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే వారు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కోయంబత్తూర్ కి చెందిన  సిద్ధిక్ రాజా(22) స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతని మిత్రులు విగ్నేష్(22), రాజశేఖర్(20) , వారి సీనియర్స్ కురుప్పస్వామి(24), గౌతమ్(23) ఇటీవల కాలేజీలో పరీక్షలు రాశారు. పరీక్ష అనంతరం వీరు మందు పార్టీ చేసుకోవాలని అనుకున్నారు.

పరీక్ష రాసిన అనంతరం ఈ నలుగురు మిత్రులు వైన్ షాప్ కి వెళ్లారు. అక్కడ మందు తాగారు. బార్ మూసివేసిన తర్వాత ఇంకా కొంచెం మద్యం తీసుకొని సమీపంలోని ఓ రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లారు. అక్కడే రైల్వే ట్రాక్ పై కూర్చొని మద్యం సేవించారు. కాగా... వెనక నుంచి ఓ రైలు వేగంగా రవడాన్ని ముందుగా విగ్నేష్ గుర్తించాడు. వెంటనే రైల్వే ట్రాక్ దాటేసి... ఈ విషయాన్ని స్నేహితులకు కూడా చెప్పాడు.

Also Read యువకుడి ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ మోజు, బ్రేక్ డ్యాన్స్ మెషిన్ పై ......

వాళ్లు మద్యం మత్తులో ఉండటంతో.. వేగంగా అక్కడి నుంచి కదలలేకపోయారు. ఆలోపు వేగంగా వచ్చిన రైలు వారిని ఢీకొట్టింది. దీంతో.. నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తన నలుగురు మిత్రులు తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడాన్ని చూసి విగ్నేష్ తట్టుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. అతని ఏడుపు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని పోస్టుమార్టంకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 

click me!