కరోనా ఇంకెప్పటికీ పోదా..? పరిశోధకులు ఏమంటున్నారు..?

By telugu news teamFirst Published May 8, 2021, 9:03 AM IST
Highlights

ఈ కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని... దీర్ఘకాలం పాటు కొనసాగుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని... థర్డ్ వేవ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
 

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేస్తోంది. ప్రతిరోజూ దాదాపు 4లక్షల కేసులు నమోదౌతున్నాయి. ఈ వైరస్ నుంచి ఎలా బయటపడాలో ఎవరికీ అర్థం కావడం లేదు. దీనికి విరుగుడు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో... అందరూ వ్యాక్సిన్ బాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజా పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతం కాదని... దీర్ఘకాలం పాటు కొనసాగుతోందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని... థర్డ్ వేవ్ కూడా మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

జర్మనీకి చెందిన హైడెల్బర్గ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్, చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లు త‌మ ప‌రిశోధ‌న‌ల ఆధారంగా కరోనా వైరస్ సజీవంగా ఉంటుంద‌ని పేర్కొన్నాయి. ఈ పరిశోధనల‌కు సంబంధించిన‌ నివేదిక జనరల్ సైంటిఫిక్‌లో కూడా ప్రచురిత‌మ‌య్యింది. ప్రపంచంలోని ఉత్తర, దక్షిణ దేశాలలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అత్య‌ధికంగా ఉంటుంద‌ని ఈ నివేదిక‌లో పేర్కొన్నారు. 

వేసవి అయినా, శీతాకాలం అయినా కరోనా  తీవ్రత‌లో ఎటువంటి మార్పు ఉండ‌బోద‌ని వివ‌రించారు. 117 దేశాల నుంచి సేక‌రించిన‌ డేటా ఆధారంగా పరిశోధకులు ఈ నివేదికను రూపొందించారు. అయితే కరోనాకు నివారణ మాత్రమే సాధ్య‌మ‌ని, ఇందుకోసం టీకాలు వేయించుకున్న తరువాత కూడా మాస్క్‌లు ధ‌రించడం, భౌతిక దూరం పాటించ‌డం, శానిటైజేష‌న్  మొద‌లైన‌వి త‌ప్ప‌నిస‌రి అని ప‌రిశోధ‌కులు స్పష్టం చేశారు.

click me!