దారుణం: అబ్బాయితో మాట్లాడినందుకు గుండు కొట్టించారు

Published : Mar 01, 2020, 03:00 PM IST
దారుణం: అబ్బాయితో మాట్లాడినందుకు గుండు కొట్టించారు

సారాంశం

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ కూతురు ఓ అబ్బాయితో మాట్లాడడాన్ని సహించలేక  తల్లిదండ్రులు ఆమెను చితకబాదారు.ఈ దారుణ ఘటన అలిరాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న సౌద్వలో ఓ మైనర్‌ బాలిక తనకు పరిచయం ఉన్న అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడింది.   

భోపాల్: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ కూతురు ఓ అబ్బాయితో మాట్లాడడాన్ని సహించలేక  తల్లిదండ్రులు ఆమెను చితకబాదారు.. ఈ దారుణ ఘటన అలిరాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న సౌద్వలో ఓ మైనర్‌ బాలిక తనకు పరిచయం ఉన్న అబ్బాయితో ఫోన్‌లో మాట్లాడింది. 

ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కన్న కూతరు అనే కనికరం లేకుండా ఆ అమ్మాయిని విపరీతంగా కొట్టారు. అంతేకాదు వీధిలోకి తీసుకొచ్చి మరీ ఆమెకు గుండు కొట్టించారు. 

ఇంకెప్పుడూ ఆ అబ్బాయితో మాట్లాడను వదిలిపెట్టండి అంటూ ఆ అమ్మాయి వేడుకున్నా వారు వినిపించుకోకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్‌ మీడియా ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికను హింసించిన వారిలో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.

PREV
click me!

Recommended Stories

Delhi Accident : ఢిల్లీలో కుప్పకూలిన హాస్టల్ భవనం... శిథిలాల కింద 50 మంది విద్యార్థులు ఉన్నారా?
నేపాల్ భయానక దృశ్యాలు | Nepal Visuals | Asianet News Telugu