ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్.. బీజేపీలో చేరిన కిషోర్ ఉపాధ్యాయ్.. ఒక్క రోజులో మారిన సీన్..

Published : Jan 27, 2022, 01:53 PM IST
ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్.. బీజేపీలో చేరిన కిషోర్ ఉపాధ్యాయ్.. ఒక్క రోజులో మారిన సీన్..

సారాంశం

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Uttarakhand Election 2022) వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో చోటుచేసుకున్నట్టుగా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఉత్తరాఖండ్ Congress Party మాజీ అధ్యక్షుడు  కిషోర్ ఉపాధ్యాయ్ బీజేపీలో చేరారు.

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల (Uttarakhand Election 2022) వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో చోటుచేసుకున్నట్టుగా పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించబడిన ఉత్తరాఖండ్ Congress Party మాజీ అధ్యక్షుడు  కిషోర్ ఉపాధ్యాయ్ బీజేపీలో చేరారు. ఈ రోజు బీజేపీ బీజేపీ ఉత్తరాఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో Kishore Upadhyay కాషాయ కండువా కప్పుకున్నారు. అయితే బీజేపీలో చేరిన తర్వాత కిషోర్ ఉపాధ్యాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్‌ను అభివృద్దిలో ముందుకు తీసుకెళ్లాలనే స్ఫూర్తితో తాను బీజేపీలో చేరినట్టుగా చెప్పారు. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ పార్టీని అడగాలని పేర్కొన్నారు. 

ఇక, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో పాల్పడుతున్నాడనే కారణంతో కిషోర్ ఉపాధ్యా‌య్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయనను అన్ని పదవుల నుంచి తొలగించింది. ‘మీరు అనేక హెచ్చరికలు చేసినప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి మిమ్మల్ని ఆరేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరిస్తున్నాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది" అని కాంగ్రెస్ పార్టీ ఒక లేఖలో కిషోర్ ఉపాధ్యాయ్‌కు తెలిపింది. 

ఇక, కిషోర్ ఉపాధ్యాయ్ కొన్ని వారాల కిందట బీజేపీ ఉత్తరాఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమయ్యారు. దీంతో ఆయన పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించినట్టుగా తెలుస్తోంది.

మరోవైపు ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా కాంగ్రెస్ అధిష్ఠానంపై మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అగ్ర నేత హ‌రీష్ రావ‌త్ (Harish Rawat) అసంతృప్తిగా ఉన్నారు. ఈ విష‌యంలో బ‌హిరంగంగానే ప‌లుమార్లు వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలోనే ఈ అసంతృప్తిని చల్లార్చడానికి రావత్‌ను ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చార సార‌థిగా నియ‌మించింది. ఉత్తరాఖండ్‌ ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దేవేందర్‌ యాదవ్‌తో రావత్‌కు ఉన్న విభేదాలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. 

ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం.. రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతలను పిలిపించి ప్రస్తుత పరిస్థితులపై చర్చించింది. ఆ తర్వాత కిషోర్ ఉపాధ్యా‌య్‌ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో హరీష్ రావత్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో హరీష్ రావత్ పేరు ఉంచినప్పటికీ.. ఆయన పోటీచేసే స్థానాన్ని రామ్‌నగర్‌కు బదులుగా లాల్కువా మార్చడం గమనార్హం. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా ఉన్న కిషోర్ ఉపాధ్యాయ్ బీజేపీలో చేరారు. ఈ పరిస్థితులను ఎదుర్కొన్ని కాంగ్రెస్ ఎన్నికల్లో ఏ మేరకు ఫలితాలను సాధిస్తుందో వేచిచూడాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?